May 10 2021 @ 22:52PM

ప్రభాస్ ‘సలార్’లో శివగామి

బాహుబలితో తెలుగు సినిమా ఇండస్ట్రీ స్థాయిని ప్రపంచానికి చాటి చెప్పాడు దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి. ఆ సినిమా తర్వాత టాలీవుడ్‌లో రికార్డుల గురించి వర్ణనే మారిపోయింది. నాన్ బాహుబలి రికార్డ్స్ అంటూ చెప్పుకునే పరిస్థితి ఏర్పడింది. అలాంటి స్థాయి ఆ చిత్రానికి రావడానికి అందులో నటించిన ప్రతి పాత్ర కారణమని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా బాహుబలి, భళ్లాలదేవ పాత్రల తర్వాత అంతే పవర్ ఫుల్ పాత్ర శివగామిది. ఆ పాత్రలో రమ్యకృష్ణ విశ్వరూపమే చూపించింది. ఆ సినిమా తర్వాత కొన్ని చిత్రాలలో రమ్యకృష్ణ నటించింది కానీ.. శివగామి పేరు మరిచిపోయే పాత్ర మాత్రం ఆమెకు పడలేదు. అయితే ఇప్పుడు మరోసారి ప్రభాస్ చేస్తున్న చిత్రంలో ఆమెకు ఓ పవర్ ఫుల్ పాత్ర పడినట్లుగా వార్తలు వస్తున్నాయి. కె.జి.ఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్, యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కాంబినేషన్‌లో రూపొందుతున్న చిత్రం ‘సలార్’. ఈ చిత్రంలో రమ్యకృష్ణ చాలా కీలకమైన పాత్రలో నటించబోతోదంటూ తాజాగా వార్తలు బయటికి వచ్చాయి. మరి ఈ వార్తల్లో ఎంత నిజముందో తెలియదు కానీ.. ‘సలార్’లో రమ్యకృష్ణ పాత్ర సాలిడ్‌గా ఉంటుందనేలా వార్తలు మాత్రం వైరల్ అవుతున్నాయి.