Abn logo
May 23 2020 @ 04:38AM

పేదలకు రంజాన్‌ కిట్ల అందజేత

కల్లూరు, మే 22: రంజాన్‌ మాసంలో పేదవారికి సరుకులు పంపిణీ(తోఫా) ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య అందజేయడం అభినందనీయమని ఖమ్మం పోలీస్‌ కమిషనర్‌ తఫ్సీర్‌ ఇక్బాల్‌ అ న్నారు. కల్లూరులో శుక్రవారం పేద ముస్లింలకు రంజాన్‌ కిట్లను సీపీతోపాటు ఎమ్మెల్యే సండ్ర అందజేశారు. సీపీ మాట్లాడుతూ రంజాన్‌ పండుగను పేదవారు సంతోషంగా జరుపుకొనేందుకు ఎమ్మెల్యే దాతృత్వం చూపటం ఆదర్శనీయమన్నారు.


ఎమ్మెల్యే సండ్ర మాట్లాడుతూ ఇస్లాం ధర్మం సర్వమానవాళికి శాంతి, ప్రేమ, దయ గుణానికి మార్గం చూపుతుందన్నారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ ఖమర్‌, ఆర్డీవో శివాజీ, ఏసీపీ వెంకటేష్‌, ఎంపీపీ, జడ్పీటీసీలు బీరవల్లి రఘు, కట్టా అజయ్‌కుమార్‌, సర్పంచ్‌ లక్కినేని నీరజరఘు, ముస్లిం కమిటీ సదర్‌ ఎండీ.అనీఫ్‌, మాజీసదర్‌ సయ్యద్‌ అలీ, డీసీసీబీ డైరెక్టర్‌ బోబోలు లక్ష్మణ్‌రావు, టీఆర్‌ఎస్‌ నాయకులు పెడకంటి రామకృష్ణ, కాటమనేని వెంకటేశ్వరరావు, ఉబ్బన వెంకటరత్నం, కొరకొప్పు ప్రసాద్‌ పాల్గొన్నారు.

Advertisement
Advertisement