Abn logo
May 24 2020 @ 04:55AM

రంజాన్‌ను సంతోషంగా జరుపుకోవాలి

రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌

పలు డివిజన్లలో రంజాన్‌ కిట్ల పంపిణీ


ఖమ్మం కార్పొరేషన్‌, మే23: ముస్లింలు రంజాన్‌ పండుగను సంతోషంగా జరుపుకోవాలని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ ఆకాంక్షించారు. అందుకే తన ఫౌండేషన్‌ ద్వారా ఐదువేల ముస్లిం కుటుంబాలకు రంజాన్‌ తోఫాపేరుతో పండుగ కానుక అందచేస్తున్నామన్నారు. శనివారం మంత్రి పువ్వాడ తన సతీమణి వసంతలక్ష్మితో కలిసి నగరంలోని పలు డివిజన్లలలో ముస్లిం కుటుంబాలకు డ్రై ఫ్రూట్స్‌తో సహా పది రకాల నిత్యావసర సరుకులను పంపిణీచేఽశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ లాక్‌డౌన్‌ నేపథ్యంలో సొంత నిధులతో ఐదువేల కుటుంబాలకు రంజాన్‌ తోఫా కిట్లు పంపిణీ చేస్తున్నామన్నారు. తన పుట్టినరోజు సందర్భంగా వేడుకలకు దూరంగా ఉండి పది వేల కుటుంబాలకు నిత్యావసర వస్తువులు అందించటం ఎంతో ఆత్మసంతృప్తినిచ్చిందని మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ పేర్కొన్నారు.


మేడేను పురస్కరించుకొని ఐదువేల కార్మికుల కుటుంబాలకు నిత్యావసర వస్తువులను అందచేశామన్నారు. రంజాన్‌ ముస్లిం సోదరులకు ఎంతో ముఖ్యమైన పండుగ అని, వారంతా సంతోషంగా జరుపుకోవాలనే ఉద్దేశ్యంతో రంజాన్‌ కిట్లను ఉచితంగా పంపిణీ చేశామని మంత్రి పువ్వాడ పేర్కొన్నారు. కార్యక్రమంలో మేయర్‌ డాక్టర్‌. జీ.పాపాలాల్‌, జడ్పీచైర్మన్‌ లింగాల కమల్‌రాజ్‌, ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మినారాయణ, ఆయా డివిజన్ల కార్పొరేటర్లు, నాయకులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement