Abn logo
Aug 4 2020 @ 14:43PM

బయో సెక్యూర్ పద్ధతిలో రానా, మిహిక పెళ్లి

టాలీవుడ్ హీరో రానా దగ్గుబాటి తన నెచ్చెలి మిహికను ఆగస్ట్ 8న పెళ్లి చేసుకోనున్న సంగతి తెలిసిందే. కరోనా వైరస్ కారణంగా వీరి పెళ్లి సాదాసీదాగా జరగనుందని వార్తలు వినిపిస్తున్నాయి. ముందుగా వీరి పెళ్లి ఫలక్‌నామా ప్యాలెస్‌లో జ‌రుగుతుంద‌ని వార్త‌లు వినిపించాయి. కానీ తాజా స‌మాచారం మేర‌కు వీరి పెళ్లి బ‌యో సెక్యూర్ ప‌ద్ధ‌తిలోనే జ‌ర‌గ‌నుంద‌ట‌. అది కూడా రామానాయుడు స్టూడియోలో అనే వార్త‌లు వినిపిస్తున్నాయి. రెండు కుటుంబాల‌కు చెందిన వారిలో ముప్పై మంది లోపువారే ఈ పెళ్లికి హాజ‌ర‌వుతున్నార‌ని టాక్. క‌రోనా వైర‌స్ కార‌ణంగా భౌతిక దూరం పాటించ‌డ‌మే కాకుండా, పరిస‌ర ప్రాంతాల‌ను శానిటైజ్ చేస్తార‌ట‌. 

Advertisement
Advertisement
Advertisement