Abn logo
May 21 2020 @ 12:36PM

ఇక అఫీషియల్.. వైరల్ అవుతున్న రానా ట్వీట్!

త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతున్న టాలీవుడ్ యంగ్ హీరో దగ్గుబాటి రానా, మిహికా బజాజ్ నిశ్ఛితార్థం అంటూ బుధవారం వార్తలు వచ్చాయి. మిహిక కుటుంబ సభ్యులు హైదరాబాద్‌లోని సురేష్ బాబు ఇంటికి రావడంతో ఈ వార్తలు మొదలయ్యాయి. అయితే ఎంగేజ్మెంట్ కోసం కాదని పెళ్లికి ముహూర్తాలు పెట్టుకోవడం కోసమని సురేష్ బాబు క్లారిటీ ఇచ్చారు.


మిహికతో కలిసి ఉన్న ఫొటోను రానా తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేశాడు. `ఇక అఫీషియల్` అంటూ కామెంట్ చేశాడు. ఆ ఫొటోలో రానా, మిహిక సాంప్రదాయ దుస్తుల్లో నవ్వుతూ పక్కపక్కనే కూర్చున్నారు. సాంప్రదాయ వేడుకలా ఘనంగా జరగడం, `ఇక, అధికారికం` అంటూ రానా కామెంట్ చేయడంతో ఎంగేజ్మెంట్ జరిగిపోయి ఉంటుందని విశ్లేషణలు వినిపిస్తున్నాయి.   



Advertisement
Advertisement
Advertisement