Abn logo
Sep 20 2020 @ 20:49PM

‘వైఆర్‌యూ‌’.. అంటోన్న రానా దగ్గుబాటి

Kaakateeya

'లీడర్‌' చిత్రంతో ఎంట్రీ ఇచ్చిన రానా దగ్గుబాటి హీరోగానే కాకుండా వైవిధ్యమైన పాత్రలతో దూసుకుపోతోన్న విషయం తెలిసిందే. పాన్‌ ఇండియా యాక్టర్‌గా గుర్తింపు పొందిన రానా దగ్గుబాటికి ప్రత్యేక ఫాన్ బేస్‌ కూడా ఉందంటే నమ్మాలి మరి. ముఖ్యంగా ఆయనని భళ్లాలదేవ పాత్ర.. ప్రేక్షకులకు చాలా దగ్గర చేసింది. అలాగే 'నేను రాజు నేనే మంత్రి' చిత్రం కూడా ఆయనకు హీరోగా మంచి గుర్తింపును తెచ్చిపెట్టింది. ఇక వెండితెరపైనే కాకుండా బుల్లితెరపై కూడా రానా తన హవా చూపించాడు. 




నెంబర్‌ వన్‌ యారి షోతో సెలబ్రిటీలను ఇంటర్వ్యూలు చేసి.. అలరించిన రానా ఇప్పుడు ఓ కామెడీ షో ద్వారా మరోసారి ఎంటర్‌టైన్‌ చేసేందుకు రెడీ అవుతున్నారు. 'వైఆర్‌యు' అనే టైటిల్‌తో తను చేయబోతోన్న షో త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. దీనికి సంబంధించిన టీజర్‌ను తాజాగా రానా సోషల్‌ మీడియాలో విడుదల చేశారు. ఈ టీజర్‌లో స్పానిష్ పెయింటర్‌ సాల్వదార్ డాలీని రానా ఇంటర్వ్యూ చేస్తున్నారు. ఇది కామెడీగా ఉండటంతో ఇది కామెడీ షో అని తెలుస్తుంది. పూర్తి వివరాలు త్వరలోనే తెలియనున్నాయి.



Advertisement
Advertisement
Advertisement