Abn logo
Mar 9 2021 @ 12:56PM

బాలీవుడ్ నటుడు రణబీర్ కపూర్‌కు కరోనా

ముంబై : ప్రముఖ బాలీవుడ్ నటుడు రణబీర్ కపూర్ కు మంగళవారం జరిపిన పరీక్షల్లో కొవిడ్-19 పాజిటివ్ అని తేలింది.ఈ విషయాన్ని రణబీర్ కపూర్ తల్లి నీతూ కపూర్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. ‘‘కరోనా వల్ల రణబీర్ కపూర్ మందులు తీసుకుంటూ కోలుకుంటున్నాడు...రణబీర్ ఇంట్లోనే స్వీయ నిర్బంధంలో ఉండి జాగ్రత్తలు పాటిస్తున్నాడు’’ అని నీతూ కపూర్ పోస్టు చేశారు. రణబీర్ కపూర్ త్వరగా కరోనా నుంచి కోలుకోవాలని అతని అభిమానులు కోరుకుంటున్నారు. రణబీర్ కపూర్ బ్రహ్మాస్త్ర చిత్రంలో కనిపించారు. 

Advertisement
Advertisement
Advertisement