Abn logo
Jan 14 2021 @ 14:33PM

ఆకట్టుకుంటున్న `రంగ్ దే` జోడీ!

నితిన్, కీర్తి సురేష్ హీరో హీరోయిన్లుగా యువ దర్శకుడు వెంకీ అట్లూరి తెరకెక్కిస్తున్న రొమాంటిక్ ఎంటర్‌టైనర్ `రంగ్ దే`. సితార ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్‌పై నాగవంశీ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమాను సంక్రాంతికి విడుదల చేయాలనుకున్నారు. అయితే 50శాతం ఆక్యుపెన్సీకి మాత్రమే అనుమతి ఉండడంతో ఆ ఆలోచనను విరమించుకున్నారు. 


వేసవి సందర్భంగా మార్చి 26న సినిమాను విడుదల చేయాలనుకుంటున్నారట. సంక్రాంతి సందర్భంగా చిత్రబృందం తాజాగా ఓ పోస్టర్‌ను అభిమానులతో పంచుకుంది. ఈ పోస్టర్‌లో కీర్తి పట్టు చీరలో మెడ నిండా నగలతో చిరునవ్వులు చిందిస్తూ సాంప్రదాయబద్ధంగా ఉంది. నితిన్ కలర్‌ఫుల్‌గా ఉన్నాడు. `రంగ్ దే` జోడీ పోస్టర్ అందిరినీ ఆకట్టుకుంటోంది. 

Advertisement
Advertisement
Advertisement