Abn logo
Aug 10 2021 @ 20:57PM

శ్రీనివాస్ కుటుంబానికి న్యాయం జరిగేలా చూస్తా: రంగన్న

ఏలూరు: శ్రీనివాస్ కుటుంబానికి న్యాయం జరిగేలా చూస్తానని రాష్ట్ర రజక అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ సుకుమంచుపల్లి రంగన్న అన్నారు. రంగంపేట మండలంలోని సుభద్రంపేటలో హత్యకు గురైన ఏలూరి శ్రీనివాస్ మృతదేహానికి ఎట్టకేలకు పెద్దాపురం ఏరియా ఆస్పత్రిలో పోస్టుమార్టం పూర్తి అయింది.  శ్రీనివాస్ కుటుంబాన్ని ఆస్పత్రి వద్ద  పరామర్శించారు. శ్రీనివాస్ హత్యకేసులో నిందితులను పోలీసులు ఇప్పటికే అరెస్ట్ చేశారన్నారు. శ్రీనివాస్ హత్య విషయాన్ని సీఎం జగన్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లామన్నారు. దురహంకారంతోనే శ్రీనివాస్‌ను ఓసీ సామాజిక వర్గానికి చెందిన వారు హత్య చేశారని చెప్పారు.రజక కులాన్ని కొందరు అగ్రవర్ణల వారు దురహంకారంతో చూస్తున్నారని ఇది సరైన పద్ధతి కాదని రంగన్న అన్నారు.