Advertisement
Advertisement
Abn logo
Advertisement

మోడరన్ మోజులే..

ఇప్పుడు సంక్రాంతి పండగంతా

మోడరన్ రాజ్యమేలుతోంది

ఆన్‌లైన్ గోగుపిడకలు

ఇంటి ముంగిట రెడీమేడ్/ రంగవల్లులు

గుమ్మాలకు ప్లాస్టిక్ రంగురంగుల

మామిడి తోరణాలు

హైటెక్ హరిదాసులు/ మోటార్ సైకిలుపై రయ్ రయ్

మంటూ బ్యాటరీ స్పీకర్‌లో

హరినామ సంకీర్తనలు

స్వీగ్గీ నుంచి పిండి వంటలు

సెల్‌ఫోన్లో పతంగుల గేమింగులు

వాట్సాప్‌లో బంధుమిత్రుల

క్షేమ సమాచారాలు

పండగ ముచ్చట్ల కలబోతలు

కొత్త బట్టలతో సెల్ఫీలు/ ఫేస్‌బుక్‌లో అప్‌లోడింగ్‌లు

ఆపై మిత్రులతో చాటింగ్‌లు

లైకులు కోసం తాపత్రయాలు 

అబ్బో ఇప్పుడు పండగంతా/ మోడరన్ మోజులే...

హతవిధీ! ఏమి దౌర్భాగ్యం వచ్చింది...

పొరలు కప్పిన నేత్రాలు విచ్చుకోవాలి 

అసలైన పండగును అందరూ కలసి మెలసి

చేసుకోవాలి.– రంగరాజు గాదిరాజు

Advertisement
Advertisement