Advertisement
Advertisement
Abn logo
Advertisement

భారతీయ కిసాన్‌ సంఘ్‌ రాష్ట్ర అధ్యక్షుడిగా రంగారావు

మేడ్చల్‌: భారతీయ కిసాన్‌ సంఘ్‌ రాష్ట్ర అధ్యక్షుడిగా జోగినపల్లి రంగారావు ఎన్నికయ్యారు. మంగళవారం భారతీయ కిసాన్‌ సంఘ్‌ తెలంగాణ రాష్ట్ర మహాసభలు మేడ్చల్‌ లోని శ్రీనివాస కల్యాణ మండపంలో జరిగాయి. ఈ కార్యక్రమంలో భారతీయ కిసాన్‌ సం ఘ్‌ నూతన కమిటీని మంగళవారం ఎన్నుకున్నారు. రాష్ట్ర అధ్యక్షుడిగా జోగినపల్లి రంగారా వు, ప్రధాన కార్యదర్శిగా రాజరెడ్డి ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా కార్యక్రమంలో పాల్గొన్న భారతీయ కిసాన్‌ సంఘ్‌ జాతీయ కార్యదర్శి మోహిని మోహన్‌మిశ్రా దేశంలో ఉన్న వివి ధ రైతాంగ సమస్యలపై మాట్లాడారు. రైతు మాత్రమే తాను అమ్మిన దానికి టాక్స్‌ చెల్లిస్తున్నాడని, స్వాతంత్రం వచ్చి 75 ఏళ్లు అయినా దేశంలో రైతుల పరిస్థితి ఘోరంగా ఉందన్నా రు. అనంతరం రాష్ట్రీయ స్వయంసేవక్‌ సంఘ్‌ తెలంగాణ ప్రాంత్‌ ప్రచారక్‌ దేవేందర్‌ జీ మాట్లాడుతూ.. రాబోయే రోజుల్లో దేశం శక్తిమంతం కావాలంటే.. భారతీయ కిసాన్‌ సంఘ్‌ను బలోపేతం చేసి గ్రామ స్థాయిలో రైతాంగ సమస్య పరిష్కరించాలన్నారు. అనంతరం భూ సమస్యలు, పంట కొనుగోలు, పంటల మార్పిడి, బీమా, తదితర అంశాలపై పలు తీర్మానాలు ప్రవేశపెట్టారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర క్షేత్ర సంఘటనా కార్యదర్శి దోనారు రాములు, జాతీయ నాయకులు సాయిరెడ్డి, జాతీయ గోఆధారిత వ్యవసాయదారుల సంఘం అధ్యక్షుడు జలపతిరావు తదితరులు, భారతీయ కిసాన్‌ సంఘ్‌ మేడ్చల్‌ జిల్లా అధ్యక్షుడు కౌకుంట్ల రాజేందర్‌రెడ్డి, కార్యవర్గ సభ్యుడు కౌకుంట్ల సురేందర్‌రెడ్డి, వివిధ జిల్లాల నుంచి భారతీయ కిసాన్‌ సంఘ్‌ కార్యకర్తలు పాల్గొన్నారు. కాగా, నూతనంగా ఎన్నికైన రాష్ట్ర కార్యవర్గాన్ని పలువురు అభినందించారు.

Advertisement
Advertisement