రంగారెడ్డి: జిల్లాలోని శంషాబాద్ మండలం పిల్లోనిగుడా గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన మహ్మద్ నసీర్ అనే వ్యక్తి ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. విషయం తెలుసుకున్న శంషాబాద్ రూరల్ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని మార్చరీకి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నసీర్ బలవన్మరణానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.