కారులో నాగుపాము

ABN , First Publish Date - 2021-06-17T21:35:25+05:30 IST

కారులో అకస్మాత్తుగా నాగు పాము కనిపించడంతో.. అందులో ప్రయాణిస్తున్న వారి వెన్నులో...

కారులో నాగుపాము

రంగారెడ్డి జిల్లా: కారులో అకస్మాత్తుగా నాగు పాము కనిపించడంతో.. అందులో ప్రయాణిస్తున్న వారి వెన్నులో వణుకుపుట్టించింది. కారులో పాము కనిపించడంతో వాహనాన్ని అక్కడే ఆపి చిన్నారితో సహా దంపతులు బయటకు పరుగులు తీశారు. రంగారెడ్డి జిల్లా, తొండుపల్లి దగ్గర జాతీయ రహదారిపై ఈ ఘటన చోటు చేసుకుంది. కారులో పాము ఉన్నట్లు తెలుసుకున్న స్థానికులు స్నేక్ క్యాచర్‌కు సమాచారమందించారు. సంఘటన ప్రదేశానికి చేరుకున్న వారు పామును పట్టుకున్నారు. దీంతో కారులో వెళుతున్నవారు ఊపిరి పీల్చుకున్నారు.

Updated Date - 2021-06-17T21:35:25+05:30 IST