Abn logo
Dec 3 2020 @ 15:45PM

లారీ బోల్తా..ఇద్దరు మృతి

ప్రకాశం: జిల్లాలోని త్రిపురాంతకం మండలం ముడివేముల వద్ద రోడ్డుప్రమాదం చోటుచేసుకుంది. అదుపుతప్పి లారీ బోల్తా పడ్డ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. మరో  ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ప్రమాదంలో 30 గొర్రెలు మృతి చెందాయి. ప్రమాద సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని విచారణ జరుపుతున్నారు.

Advertisement
Advertisement
Advertisement