జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం

ABN , First Publish Date - 2021-10-17T06:43:45+05:30 IST

జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం

జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం
తీవ్ర గాయాలైన మహేష్‌

ఏటూరునాగారం, అక్టోబరు 16: కారును బొలేరో వాహనం ఢీకొంది. దీంతో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. ములుగు జిల్లా ఏటూరునాగారంలోని జాతీయ రహదారిపై  శనివారం రాత్రి చోటుచేసుకుంది. ప్రత్యక్ష సాక్షుల కథనం మేరకు.. వరంగల్‌లోని బట్టలబజార్‌కు చెందిన రేగ సాయి, రేనా, దీపక్‌, మహేష్‌, రాజు వాజేడు మండలం చీకుపల్లిలోని బొగత జలపాతాన్ని సందర్శించడానికి వచ్చారు. తిరిగి వెళ్తున్న క్రమంలో ఏటూరునాగారంలోని మూడో బ్రిడ్జి వద్ద ప్రమాదం జరిగింది. ఛత్తీ్‌సగఢ్‌ రాష్ట్రం బీజాపూర్‌ నుంచి మండలంలోని లంబాడీతండాకు మిర్చి తోటల్లో పనుల నిమిత్తం 14 మంది కూలీలు వస్తున్న బొలేరో వాహనం అదుపు తప్పి కారును ఢీకొంది. దీంతో దీంతో బొలేరోలో ఉన్న సురోజ్‌, మేస్ర, దీపక్‌కు తీవ్ర గాయాలయ్యాయి. కారులో ఉన్న మహేష్‌ తీవ్రంగా గాయపడ్డాడు. మరో ఆరుగురికి స్వల్ప గాయాలయ్యాయి. క్షతగాత్రులను 108 వాహనంలో స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరించారు. వీరిలో మహేష్‌ పిరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో వరంగల్‌లోని  ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనలో కారు నుజ్జునుజ్జు అయ్యింది. బొలేరో వాహనం బోల్తాపడింది. బొలెరో డ్రైవర్‌ పరారీలో ఉన్నాడు. 

Updated Date - 2021-10-17T06:43:45+05:30 IST