నీట మునిగిన పంట పరిశీలన

ABN , First Publish Date - 2020-12-01T06:31:23+05:30 IST

నివర్‌ తుఫాన్‌ కారణంగా నక్కపల్లి మండలంలో నీట మునిగిన వరి పొలాలను సోమవారం అధికారుల బృందం పరిశీలించింది.

నీట మునిగిన పంట పరిశీలన
పాయకరావుపేట మండలం పాల్తేరులో వరి పంటను పరిశీలిస్తున్న శాస్త్రవేత్తలు


 రైతులకు వ్యవసాయ శాస్త్రవేత్తలు సూచనలు

నక్కపల్లి/ పాయకరావుపేట రూరల్‌/ కోటవురట్ల/ రాంబిల్లి/ నవంబరు 30 : నివర్‌ తుఫాన్‌ కారణంగా నక్కపల్లి మండలంలో నీట మునిగిన వరి పొలాలను సోమవారం అధికారుల బృందం పరిశీలించింది. గుల్లిపాడు, ఉద్దండపురం, గొడిచెర్ల, దేవవరం, దోసలపాడు, చీడిక తదితర గ్రామాల్లో వ్యవసాయశాఖ ఏడీఏ లచ్చన్న, అనకాపల్లి రైతు పరిశోధనా కేంద్రం ప్రధాన శాస్త్రవేత్తలు డాక్టర్‌ సాంబశివరావు, డాక్టర్‌ భవానీ, డాక్టర్‌ శైలజ తదితరులు నీట మునిగి పాడైన వరి పొలాలను పరిశీలించారు. సంబంధిత రైతులకు పలు సూచనలు చేశారు. ఏవో మహేశ్వరరావు, ఏఈవో సత్యనారాయణ పాల్గొన్నారు. అలాగే, పాయకరావుపేట మండలం పాల్తేరు, సత్యవరం, కోటవురట్ల మండలం రాజుపేట తదితర గ్రామాల్లోనూ పర్యటించారు.  ఏవో సోమశేఖర్‌, బీసీటీ ప్రతినిధి  శైలజా, ఎంపీఈవో సతీశ్‌ పాల్గొన్నారు. అదేవిధంగా రాంబిల్లి మండలం జడ్‌.చింతువా పంచాయతీలో నీటిమునిగిన వరి పంటను స్థానిక టీడీపీ నాయకుడు చెల్లూరి ఆనంద్‌, మాజీ సర్పంచ్‌ ఎరిపిల్లి చిట్టి,  చెల్లూరి గోవింద్‌ తదితరులు పరిశీలించారు.

Updated Date - 2020-12-01T06:31:23+05:30 IST