రేప్‌ చేస్తే మగసిరే మాయం!

ABN , First Publish Date - 2021-11-19T08:59:32+05:30 IST

పాకిస్థాన్‌లో అత్యాచారం ఆలోచన చేయాలంటేనే హడలి చస్తారేమో! అక్కడ రేపిస్టులకు కఠిన శిక్ష విధిస్తారు. అది మరణ శిక్ష కాదు...

రేప్‌ చేస్తే మగసిరే మాయం!

పాక్‌లో అత్యాచార దోషులకు నపుంసక శిక్ష

ఇస్లామాబాద్‌, నవంబరు 18: పాకిస్థాన్‌లో అత్యాచారం ఆలోచన చేయాలంటేనే హడలి చస్తారేమో! అక్కడ రేపిస్టులకు కఠిన శిక్ష విధిస్తారు. అది మరణ శిక్ష కాదు.. జీవితాం తం నపుంసకుడిగా గడిపే శిక్ష! అత్యాచార నిందితులు దోషి గా నిర్ధారణ అయితే శృంగార వాంఛ కలగకుండా ప్రత్యేక రసాయన ప్రక్రియ ద్వారా వారిలో పుంసత్వాన్ని నిర్వీర్యం చేస్తారు. పాక్‌లో మహిళలు, బాలికలపై అత్యాచార ఘటన లు పెరగడంతో ఈ మేరకు ఆర్డినెన్స్‌ను పాక్‌ అధ్యక్షుడు ఆరీఫ్‌ అల్వీ ఆమోదించారు. ప్రత్యేక రసాయన ప్రక్రియ ద్వారా రేప్‌ దోషులను నపుంసకులను చేయడం అనే శిక్షను దక్షిణ కొరియా, పోలండ్‌, చెక్‌ రిపబ్లిక్‌ సహా అమెరికాలోని కొన్ని రాష్ట్రాల్లో అమలు చేస్తున్నారు. 

Updated Date - 2021-11-19T08:59:32+05:30 IST