Abn logo
Nov 26 2021 @ 03:34AM

నడుస్తున్న కారులో యువతిపై అత్యాచారం

మథుర, నవంబరు 25: నడుస్తున్న కారులో ఓ యువతిపై ఇద్దరు యువకులు అత్యాచారం చేశారు. మంగళవారం రాత్రి ఆగ్రా సమీపంలో ఈ ఘటన జరిగింది. ఉత్తరప్రదేశ్‌లోని మథురకు చెందిన బాధితురాలికి ఎస్సై పరీక్ష ఉండడంతో ఆగ్రాకు వెళ్లింది. తోడుగా ఆమెకు తెలిసిన ఇద్దరు యువకులు కూడా వెళ్లారు. పరీక్ష ముగిసిన తర్వాత వారందరూ కారులో తిరిగి ప్రయాణమవుతున్నారు. వాహనం ఆగ్రా దాటిన తర్వాత ఇద్దరు యువకులు ఆమెపై ఒకరి తర్వాత ఒకరు అత్యాచారం చేశారు. అనంతరం మథురకు సమీపంలోని కోసి కాలన్‌ ప్రాంతంలో బాధితురాలిని వదిలి పరారయ్యారు.