ఆత్మహత్య చేసుకున్న అత్యాచార బాధితురాలు.. ముగ్గురు పోలీసులపై వేటు.. కారణం ఏమిటంటే..

ABN , First Publish Date - 2021-11-04T12:54:36+05:30 IST

పంజాబ్ రాష్ట్రంలోని ఆదంపూర్ నగర సమీపంలో అమ్రోహా అనే గ్రామంలో ఒక యువతి ఆత్మహత్య చేసుకొంది. ఆమె ఆత్మహత్యకు పోలీసులకే కారణమంటూ చనిపోయేముందు ఒక లేఖ రాసింది. ఈ విషయం మీడియాకు తెలియడంతో జిల్లా పోలీసు ఉన్నతాధికారులు ఆ యువతి కేసుకు సంబంధించిన ముగ్గురు పోలీసులను సస్పెండ్ చేశారు...

ఆత్మహత్య చేసుకున్న అత్యాచార బాధితురాలు.. ముగ్గురు పోలీసులపై వేటు.. కారణం ఏమిటంటే..

పంజాబ్ రాష్ట్రంలోని ఆదంపూర్ నగర సమీపంలో అమ్రోహా అనే గ్రామంలో ఒక యువతి ఆత్మహత్య చేసుకొంది. ఆమె ఆత్మహత్యకు పోలీసులకే కారణమంటూ చనిపోయేముందు ఒక లేఖ రాసింది. ఈ విషయం మీడియాకు తెలియడంతో జిల్లా పోలీసు ఉన్నతాధికారులు ఆ యువతి కేసుకు సంబంధించిన ముగ్గురు పోలీసులను సస్పెండ్ చేశారు. అందులో ఒకరు అమ్రోహా పోలీస్ స్టేషన్ ఇంచార్జి కాగా మిగతా ఇద్దరు పోలీస్ కానిస్టేబుళ్లు.


అసలేం జరిగిదంటే.. అమ్రోహాకు చెందిన దేవిక(21, పేరు మార్చబడినది)పై అదే గ్రామానికి చెందిన మోను శర్మ అనే వ్యక్తి సెప్టెంబర్ 25న అత్యాచారం చేశాడు. దీంతో దేవిక తల్లిదండ్రులు మోను శర్మపై ఫిర్యాదు చేశారు. కానీ పోలీసులు నిందితుడిని ఇంత వరకు అరెస్టు చేయలేదు.


ఆ తరువాత నుంచి మోను, అతని కుటుంబసభ్యులు దేవికను వేధించేవారు.. ఈ విషయం పోలీసులకు చెప్పినా పట్టించుకోకపోవడంతో మనస్తాపం చెందిన దేవిక ఆత్మహత్య చేసుకుంది. దేవిక తల్లిదండ్రులు ఈ విషయం మీడియా ముందుకు తీసుకురాగ.. పోలీసులపై ఒత్తిడి పెరిగింది. ఆదంపూర్ జిల్లా ఎస్పీ స్వయంగా కలుగజేసుకొని ఈ కేసుకు సంబంధించిన ముగ్గురు పోలీసులపై వేటు వేశారు. దేవిక ఆత్మహత్య, అత్యాచారం కేసుని ఒక సీనియర్ అధికారి చేత విచారణ చేయిస్తామని ఆమె తల్లిదండ్రులకు హామీ ఇచ్చారు.

Updated Date - 2021-11-04T12:54:36+05:30 IST