స్వఛ్చ మార్గం

ABN , First Publish Date - 2020-08-14T10:27:11+05:30 IST

స్వఛ్చ మార్గం సా మూహిక లక్ష్యం దిశగా జిల్లా అడుగులు వేయ బోతోంది. బల్దియాల్లో జనాభా ప్రాతిపదికన టా యిలెట్ల నిర్మాణాలు చేపట్టేందుకు

స్వఛ్చ మార్గం

బల్దియాల్లో జనాభా ప్రాతిపదికన టాయిలెట్ల నిర్మాణం

శరవేగంగా నిర్మాణ పనులు

మహిళలకోసం ప్రత్యేక మరుగుదొడ్లు

ఈనెల 15న ప్రారంభానికి సన్నాహాలు


జగిత్యాల, ఆంధ్రజ్యోతి  : స్వఛ్చ మార్గం సా మూహిక లక్ష్యం దిశగా జిల్లా అడుగులు వేయ బోతోంది. బల్దియాల్లో జనాభా ప్రాతిపదికన టా యిలెట్ల నిర్మాణాలు చేపట్టేందుకు ప్రభుత్వం ప్ర త్యేక కార్యాచరణ రూపొందించింది. పట్టణ ప్రాం తాల్లో బహిరంగ మల, మూత్ర విసర్జనలకు స్వ స్థి చేప్పే విధంగా టాయిలెట్ల నిర్మాణ పనులు జి ల్లాలో శరవేగంగా జరుగుతున్నాయి. ఈ నెల 15 స్వాతంత్య్ర దినోత్సవం రోజున ప్రారంభించేందు కు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు.


వెయ్యి జనాభాకు ఒక మరుగుదొడ్డి..

బల్దియాల్లో జనాభా, ప్రాంతాలు రోజురోజు కూ విస్తరిస్తున్నాయి. అదే సమయంలో సామూ హిక మరుగుదొడ్ల సమస్య మరింత తీవ్రంగా మారింది. బల్దియా వాసులతో పాటు రోజు వారి గా వివిధ పనుల నిమిత్తం ఇతర ప్రాంతాలకు చెందిన వారు వివిధ పనులపై జిల్లా కేంద్రంలో పాటు, పట్టణ ప్రాంతాలకు రాక పోకలు సాగి స్తుంటారు. ముఖ్యంగా మహిళలు మరుగుదొడ్లు విషయంలో తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తోంది. దీనిని గుర్తించిన ప్రభుత్వం తక్షణమే బల్దియాల్లో ప్రతి వెయ్యి జనాభాకు ఒక మరుగుదొడ్డి నిర్మిం చాలని ఖచ్చితమైన ఆదేశాలు జారీ చేసింది.


జిల్లాలో ఐదు బల్దియాలు..

జిల్లాలో జగిత్యాల, కోరుట్ల, మెట్‌పెల్లి, కోరు ట్ల, ధర్మపురి, రాయికల్‌ బల్దియాలు ఉన్నాయి. జగిత్యాల బల్దియాలో జనాభా ప్రకారం 105 సా మూహిక మరుగుదొడ్లు ఉండాల్సి ఉండగా ప్రస్తు తం 74 మాత్రమే ఉన్నాయి. కొత్తగా 40 నిర్మాణా లు వివిధ ధశల్లో పురగతిలో ఉన్నాయి. కోరుట్ల లో 69 సామూహిక మరుగు దొడ్లు ఉండాల్సి ఉండగా ప్రస్తుతం 16 మాత్రమే అందుబాటులో ఉన్నాయి. కొత్తగా 53 నిర్మాణాల్లో ఉన్నాయి. మె ట్‌పెల్లిలో 54 సామూహిక మరుగుదొడ్లు ఉండా ల్సి ఉండగా ప్రస్తుతం 18 మాత్రమే ఉన్నాయి. కొత్తగా 06 నిర్మాణాలు చేబడుతున్నారు.


ధర్మపురిలో 16 సామూహిక మరుగుదొడ్లు ఉండాల్సి ఉండగా ప్రస్తుతం 30 అందుబాటులో ఉన్నాయి. రాయికల్‌లో 15 సామూహిక మరుగుదొడ్లు ఉం డాల్సి ఉండగా ప్రస్తుతం 04 మాత్రమే ఉన్నాయి. కొత్తగా 10 నిర్మాణాలు చేపట్టవలిసి ఉండగా నా లుగు నిర్మాణాలు పూర్తయ్యాయి. ఆరు చోట్ల ప నులు వివిధ దశల్లో ఉన్నాయి. నూతనంగా సా మూహిక మరుగుదొడ్ల నిర్మాణాలు పట్టణ ప్రగతి నిధులతో నిర్మిస్తుండగా, కొన్ని సామూహిక మ రుగుదొడ్ల నిర్మాణాలు ప్రైవేటు భాగస్వామ్యంతో నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఐదు బల్దియాల్లో 112 సామూహిక మరుగుదొడ్ల నిర్మాణాలు పూర్తయ్యాయి.


స్వాతంత్య్ర దినోత్సవం రోజున..ప్రారంభిం చేందుకు సన్నాహాలు..

జగిత్యాల జిల్లాలోని ఐదు బల్దియాల్లో పూర్త యిన సామూహిక మరుగుదొడ్లను ఆగస్టు 15 స్వాతంత్య్ర దినోత్సవం రోజున ప్రారంభిం చేందు కు కలెక్టర్‌ రవి ఆధ్వర్యంలో అధికారులు సన్నా హాలు చేస్తున్నారు. జిల్లా కేంద్రంతో పాటు ధర్మ పురిలో సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌, జగిత్యాల, రాయికల్‌లో ఎమ్మెల్యే సంజయ్‌ కుమా ర్‌, కోరుట్ల, మెట్‌పెల్లిలో ఎమ్మెల్యే విద్యాసాగర్‌ రా వు ప్రారంభించనున్నారు.


10 చోట్ల నిర్మాణాలు పూర్తి..బోగ శ్రావణి, చైర్‌ పర్సన్‌, జగిత్యాల బల్దియా

జిల్లా కేంద్రంలో 10 చోట్ల సామూహిక మరు గుదొడ్లు ఏర్పాటు చేసేలా చర్యలు చేపడుతు న్నాం. ఇప్పటికే స్థలాలను గుర్తించి మోడల్‌ టా యిలెట్లను ఏర్పాటు చేశాం. స్వచ్ఛ జగిత్యాలగా మార్చబమే ప్రధాన లక్ష్యం..

Updated Date - 2020-08-14T10:27:11+05:30 IST