కులాంతర వివాహం చేసుకున్న జంటకు పుట్టింటి వారు ఏం చేశారంటే...

ABN , First Publish Date - 2021-11-12T15:42:10+05:30 IST

కులాంతర వివాహం చేసుకున్నందుకు మహిళను బలవంతంగా గుజరాత్‌కు తీసుకెళ్లిన వ్యక్తులపై చర్యలు తీసుకోనందుకు ముంబై పోలీసు కమిషనర్ హేమంత్ నాగ్రాలేను...

కులాంతర వివాహం చేసుకున్న జంటకు పుట్టింటి వారు ఏం చేశారంటే...

రక్షణ కల్పించాలని ముంబై పోలీసు కమిషనరుకు బాంబే హైకోర్టు సంచలన ఆదేశాలు

ముంబై : కులాంతర వివాహం చేసుకున్నందుకు మహిళను బలవంతంగా గుజరాత్‌కు తీసుకెళ్లిన వ్యక్తులపై చర్యలు తీసుకోనందుకు ముంబై పోలీసు కమిషనర్ హేమంత్ నాగ్రాలేను బాంబే హైకోర్టు గురువారం తప్పుబట్టింది.గుజరాత్‌లోని భచౌలోని చౌబ్రి తాలూకాకు చెందిన యువతి అహిర్ కమ్యూనిటీకి చెందినది. వేరే కులానికి చెందిన యువకుడు ఆమెను కులాంతర వివాహం చేసుకున్న తర్వాత సర్పంచ్, పెద్దల నేతృత్వంలోని అహిర్ సంఘం కులాంతర వివాహాన్ని వ్యతిరేకించిందని, జంటను చంపేస్తానని బెదిరించారని పిటిషనర్ ఆరోపించారు. 


తన తండ్రిపై దాడి చేశారని కోర్టుకు పిటిషనర్ తరపు న్యాయవాది నివేదించారు.ఈ జంట యొక్క కష్టాలు ఫిబ్రవరి 2020లో ప్రారంభమయ్యాయి. ఆ మహిళను గుజరాత్‌కు తిరిగి తీసుకువెళ్లారు.ఆమెకు సొంత కులంలోనే రెండో వివాహం చేశారు. కానీ చివరకు అక్కడి నుంచి మహిళ పారిపోయి ముంబైలోని మొదటి భర్త వద్దకు తిరిగి వచ్చింది. ఈ ఏడాది ఆగస్టులో తిరిగి వచ్చిన తర్వాత ఆమె పోవాయ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కానీ పోలీసుల నుంచి ఎలాంటి సహాయం లభించలేదు.


 దీంతో ఆ మహిళ, ఆమె మొదటి భర్త బాంబే హైకోర్టును ఆశ్రయించారు.దీంతో పోలీసు విచారణ అధికారిని సమగ్రంగా విచారించాలని కోర్టు ఆదేశించింది. కోర్టు ఆదేశంతో కులాంతర వివాహం చేసుకున్న జంటకు రక్షణ కల్పిస్తామని ముంబై పోలీస్ కమిషనర్ హేమంత్ నాగ్రాలే చెప్పారు. ప్రతివాది సర్పంచ్, సంఘం పెద్దలు, ఇతరులను అఫిడవిట్‌లు దాఖలు చేయాలని ఆదేశించింది.ఈ పిటిషన్‌పై విచారణను శనివారానికి వాయిదా వేసింది.


Updated Date - 2021-11-12T15:42:10+05:30 IST