వావ్‌.. ఏం ఠీవీ..!

ABN , First Publish Date - 2020-07-29T19:06:10+05:30 IST

బక్రీద్‌ కోసం బోయినపల్లి పెన్షన్‌ లైన్‌కు చెందిన అజ్వ ఎక్సోటిక్‌ ఫామ్‌ యజమానులు అరుదైన మేక జాతులను తెప్పించారు.

వావ్‌.. ఏం ఠీవీ..!

బక్రీద్‌ కోసం అజ్మీర్‌ జాతి మేకలు  

బోయినపల్లి: బక్రీద్‌ కోసం బోయినపల్లి పెన్షన్‌ లైన్‌కు చెందిన అజ్వ ఎక్సోటిక్‌ ఫామ్‌ యజమానులు అరుదైన మేక జాతులను తెప్పించారు. అజ్మీర్‌ జాతికి చెందిన 10 మేకలు తీసుకు వచ్చారు. వాటి రూపురేఖలు అబ్బురపరుస్తున్నాయి. ఒక్కో మేక విలువ రూ. లక్షా 20 వేల వరకు ఉంటుందని ఫాం నిర్వాహకులు షకీబ్‌, సిరాజ్‌లు తెలిపారు. కాగా,  మంగళవారం  కంటోన్మెంట్‌ బోర్డు పాలక మండలి మాజీ ఉపాధ్యక్షుడు జంపన ప్రతాప్‌ ఫామ్‌ను సందర్శించి, అజ్మీర్‌ జాతి మేకలను పరిశీలించారు. వాటితో ఫొటోలు దిగారు. 


Updated Date - 2020-07-29T19:06:10+05:30 IST