ఇద్దరి ‘గ్రిప్‌’ ఒకలాగే

ABN , First Publish Date - 2020-05-28T08:53:05+05:30 IST

అరుదైన ఫొటోలు, వీడియోలు పోస్ట్‌ చేస్తూ అభిమానులను నిత్యం అలరించే సచిన్‌ టెండూల్కర్‌.. తాజాగా షేర్‌ చేసిన ఫొటోలు సోషల్‌ మీడియాలో హల్‌చల్‌...

ఇద్దరి ‘గ్రిప్‌’ ఒకలాగే

ముంబై: అరుదైన ఫొటోలు, వీడియోలు పోస్ట్‌ చేస్తూ అభిమానులను నిత్యం అలరించే  సచిన్‌ టెండూల్కర్‌.. తాజాగా షేర్‌ చేసిన ఫొటోలు సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తున్నాయి. వెస్టిండీస్‌ బ్యాట్స్‌మన్‌ లారా కుమారుడు బ్యాట్‌ పట్టిన చిత్రంతోపాటు చిన్నతనంలో తాను బ్యాటు పట్టుకున్న ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో సచిన్‌ పోస్ట్‌ చేశాడు. ‘లారా కుమారుడి మాదిరిగానే బ్యాటు పట్టుకున్న మరో చిన్నారి ఫొటోను చూడండి. అంతర్జాతీయ క్రికెట్‌లో ఆ బాలుడు మరీ చెత్తగా ఆడలేదు’ అని రాశాడు.

Updated Date - 2020-05-28T08:53:05+05:30 IST