శాలిహుండానికి అరుదైన గుర్తింపు

ABN , First Publish Date - 2021-10-13T05:44:55+05:30 IST

శాలిహుండాం బౌద్ధ క్షేత్రానికి అరుదైన గుర్తింపు లభించింది. కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ వంద కోట్లకు చేరుకున్న సందర్భంగా కేంద్ర సాంస్కృతిక శాఖ వంద చారిత్రక ప్రదేశాల్లో గురువారం రాత్రి ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనుంది. మన రాష్ట్రం నుంచి ఐదు చారిత్రక ప్రదేశాలను ఎంపిక చేశారు. అందులో శాలిహుండం ఒకటి కావడం గమనార్హం. లేపాక్షిలోని శ్రీవీరభద్రస్వామి ఆలయం, గండికోట బురుజు (కర్నూలు జిల్లా), చంద్రగిరికోట, గండికోటలోని ప్రాచీన మాధవపెరుమాళ్ల ఆలయం, శాలిహుండం బౌద్ధక్షేత్రాలను కేంద్ర ప్రభుత్వం ఎంపిక చేసింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం నుంచి తమకు ఉత్తర్వులు అందాయని పురావస్తు శాఖ సీనియర్‌ కన్జర్వేషన్‌ అసిస్టెంట్‌ (సీనియర్‌ సీఏ, ఉత్తరాంధ్ర జిల్లాల అధికారి) శ్రీనివాసరావు ధ్రువీకరించారు. శాలిహుండంలో విద్యుత్‌ కాంతులతో కూడిన జాతీయ జెండాను

శాలిహుండానికి అరుదైన గుర్తింపు




కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ 100 కోట్లకు దాటిన సందర్భంగా వేడుకలకు కేంద్రం సన్నాహాలు

100 చారిత్రక ప్రదేశాల్లో రేపు ప్రత్యేక కార్యక్రమాలు

అందులో బౌద్ధ క్షేత్రం ఒకటి కావడం విశేషం

శాలిహుండం (గార), అక్టోబరు 12 : శాలిహుండాం బౌద్ధ క్షేత్రానికి అరుదైన గుర్తింపు లభించింది. కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ వంద కోట్లకు చేరుకున్న సందర్భంగా కేంద్ర సాంస్కృతిక శాఖ వంద చారిత్రక ప్రదేశాల్లో గురువారం రాత్రి ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనుంది. మన రాష్ట్రం నుంచి ఐదు చారిత్రక ప్రదేశాలను ఎంపిక చేశారు. అందులో శాలిహుండం ఒకటి కావడం గమనార్హం. లేపాక్షిలోని శ్రీవీరభద్రస్వామి ఆలయం, గండికోట బురుజు (కర్నూలు జిల్లా), చంద్రగిరికోట, గండికోటలోని ప్రాచీన మాధవపెరుమాళ్ల ఆలయం, శాలిహుండం బౌద్ధక్షేత్రాలను కేంద్ర ప్రభుత్వం ఎంపిక చేసింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం నుంచి తమకు ఉత్తర్వులు అందాయని పురావస్తు శాఖ సీనియర్‌ కన్జర్వేషన్‌ అసిస్టెంట్‌ (సీనియర్‌ సీఏ, ఉత్తరాంధ్ర జిల్లాల అధికారి) శ్రీనివాసరావు ధ్రువీకరించారు. శాలిహుండంలో విద్యుత్‌ కాంతులతో కూడిన జాతీయ జెండాను ఎగురవేయనున్నట్టు తెలిపారు. గురువారం సాయంత్రం ఐదు గంటల నుంచి శుక్రవారం ఉదయం ఆరు గంటల వరకూ కార్యక్రమం కొనసాగుతుందని చెప్పారు. ఇందుకు సంబంధించి ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలిపారు. వీక్షించేందుకు సందర్శకులకు సైతం అనుమతివ్వనున్నట్టు ఆయన పేర్కొన్నారు. 

 సుదీర్ఘ చరిత్ర

శాలిహుండం బౌద్ధ క్షేత్రానికి సుదీర్ఘ చరిత్ర ఉంది. బుద్ధుని కాలంనాటి రాతి విగ్రహాలు, శిలాశాసనాలు, ఇతర పనిముట్లు గతంలో ఇక్కడ తవ్వకాల్లో బయటపడ్డాయి. ప్రాచీన నాగరికతకు చిహ్నాలుగా... భావితరాలకు తెలిసేవిధంగా పురావస్తుశాఖ ఈ క్షేత్రం వద్ద పెద్ద మ్యూజియం ఏర్పాటుచేసింది. వివిధ ప్రాంతాలకు చెందిన సందర్శకులతోపాటు పాఠశాలల విద్యార్థులు నిత్యం సందర్శిస్తుంటారు. ఏటా బౌద్ధ భిక్షువులు ఇక్కడకు వచ్చి ప్రార్థనలు చేయడం విశేషం. ఎత్తయిన ఈ  ్దక్షేత్రం పక్క నుంచే వంశధార నది పరవళ్లు తొక్కుతూ ప్రవహిస్తోంది. శాలిహుండం బౌద్ధ క్షేత్రానికి అరుదైన గుర్తింపు దక్కడంపై హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. 



Updated Date - 2021-10-13T05:44:55+05:30 IST