Advertisement
Advertisement
Abn logo
Advertisement

రెండు తలల విచిత్ర బల్లిని ఎప్పుడైనా చూశారా!?

ఇళ్లలో బల్లిని ఒక గోడ మీద నుంచి మరో గోడ మీదకి వెళుతూ ఉండడం మనం చూసే ఉంటాం. కానీ ఎప్పుడైనా నీలపు రంగు నాలుక గల రెండు తలల బల్లిని చూశారా? అలాంటిదే ఒక బల్లి వీడియో సోషల్ మీడియోలో వైరల్ అవుతోంది. ఆ వీడియోలో ఒక జూకీపర్ తన చేతుల్లో ఆ బల్లిని పట్టుకొని ఉన్నాడు.  ఈ విచిత్రమైన బల్లి అమెరికాలోని కాలిఫోర్నియాలోని రెప్టైల్ జూలో ఉంది.


ఆ రెప్టైల్ జూ వ్యవస్థాపకుడు జే బ్రేవర్ తరుచూ తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో ఇలాంటి విచిత్రిమైన వీడియోలు పెడుతూ ఉంటారు. ఈ వీడియోలో ఆయన తన అరచేతిపై ఒక చిన్న బల్లిని పెట్టుకుని ఉన్నారు. దాని నాలుక నీలం రంగులో ఉంది. ఆ బల్లి ఎంత చిన్నగా ఉందంటే ఆయన బొటనవేలు సైజులో ఉంటుంది.. అంతే!. బ్రేవర్ దానిని ఒక అందమైన బుల్లి జీవిగా వర్ణించారు.


ఇంతకుముందు కూడా బ్రేవర్ తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో చిన్న చిన్న పాములతో కనిపించాడు. ఒకసారైతే ఒక పెద్ద పాముతో వీడియో షూట్ చేస్తున్నప్పుడు ఆయనను ఆ పాము కాటేసింది.. అయినా ఆయన ఏ మాత్రం భయపడకుండా అలాంటి పాముల ఎన్నో రకాల జాతులను తన జూలో పెంచుతున్నారు. 

Advertisement

ప్రత్యేకంమరిన్ని...

Advertisement