అమెరికా మహిళ ఇంట్లో రెండు తలల పాము.. ఫొటోలు వైరల్

ABN , First Publish Date - 2020-10-23T21:50:46+05:30 IST

ఇది సదరన్ బ్లాక్ రేసర్ పామని, ఇలా రెండు తలలతో పుట్టడం చాలా అరుదైన విషయమని పేర్కొన్నారు. పిండం అభివృద్ధి దశలో రెండు

అమెరికా మహిళ ఇంట్లో రెండు తలల పాము.. ఫొటోలు వైరల్

న్యూఢిల్లీ: అమెరికాలోని ఓ మహిళ ఇంట్లో అరుదైన రెండు తలల పామును అధికారులు గుర్తించారు. ఫ్లోరిడాలోని పామ్ హార్బర్‌లో కే రోజెర్స్ ఇంటిలో ఈ పామును గుర్తించినట్టు వన్యప్రాణి అధికారులు తెలిపారు. ఇది సదరన్ బ్లాక్ రేసర్ అని, ఇలా రెండు తలలతో పుట్టడం చాలా అరుదైన విషయమని పేర్కొన్నారు. పిండం అభివృద్ధి దశలో రెండు మోనోజైగోటిక్‌ కవలలను వేరు చేయడంలో విఫలమైనప్పుడు తలలు మినహా రెండు శరీర భాగాలు కలిసిపోతాయి. రెండు తలలకు కోరలు ఉంటాయి.


పరిస్థితులకు అనుగుణంగా రెండూ స్పందిస్తాయి. అయితే, ఒకేలా మాత్రం స్పందించవు. అందుకనే ఇవి బతకడం చాలా అరుదు. నిర్ణయాలు తీసుకోవడంలో రెండు తలలు స్వతంత్రంగా ఆలోచించడం వల్ల ఆపద సమయాల్లో శత్రువులకు దొరికిపోతుంటాయి. ప్రస్తుతం ఈ రెండు తలల పామును అమెరికాలోని  ఎఫ్‌డబ్ల్యూసీ సంరక్షిస్తోంది. ఇప్పుడు పాముకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.


Updated Date - 2020-10-23T21:50:46+05:30 IST