ట్రాఫిక్ జరిమానాల విషయమై వాహనదారులకు Ras Al Khaimah గుడ్‌న్యూస్

ABN , First Publish Date - 2022-01-06T16:55:15+05:30 IST

ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడిన వాహనదారులకు రాస్ అల్ ఖైమా ట్రాఫిక్ విభాగం గుడ్‌న్యూస్ చెప్పింది.

ట్రాఫిక్ జరిమానాల విషయమై వాహనదారులకు Ras Al Khaimah గుడ్‌న్యూస్

రాస్ అల్ ఖైమా: ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడిన వాహనదారులకు రాస్ అల్ ఖైమా ట్రాఫిక్ విభాగం గుడ్‌న్యూస్ చెప్పింది. ట్రాఫిక్ జరిమానాలపై 50శాతం తగ్గింపు పథకాన్ని పొడిగిస్తున్నట్లు ప్రకటించింది. ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడిన వాహనదారులు 2022 జనవరి 17 వరకు తగ్గింపు అవకాశాన్ని పొందవచ్చని పేర్కొంది. జనవరి 3న ముగియనున్న గడువును తాజాగా మరో రెండు వారాలు పొడిగించింది. కాగా, యూఏఈ స్వర్ణోత్సవ వేడుకల్లో భాగంగా 2021 డిసెంబర్‌లో రాస్ అల్ ఖైమా ట్రాఫిక్ చలానాలపై 50 శాతం తగ్గింపు పథకాన్ని తీసుకువచ్చిన విషయం తెలిసిందే. తీవ్రమైన ట్రాఫిక్ ఉల్లంఘనలు, బ్లాక్ ట్రాఫిక్ పాయింట్ల మినహాయింపు, వాహనాల జప్తు కేసులకు కూడా తగ్గింపు పథకం వర్తిస్తుంది. ఇక రాస్ అల్ ఖైమా తాజాగా తీసుకున్న ఈ నిర్ణయం పట్ల అక్కడి ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.   

Updated Date - 2022-01-06T16:55:15+05:30 IST