Abn logo
Sep 28 2021 @ 14:02PM

ర్యాష్ డ్రైవింగ్.. బైక్‌పై నిలబడి గన్‌తో కాల్చుతూ హంగామా.. నంబర్ ప్లేట్లు తీసేసి ఆకతాయిల రచ్చ.. ఎక్కడో కాదు..

విజయవాడ: విజయవాడలో ఆకతాయిల ఆగడాలు పెచ్చు మీరుతున్నాయి. దుర్గగుడి ఫ్లై ఓవర్‌పై ప్రమాదకర విన్యాసాలు చేస్తున్నారు. బైక్‌పై నిలబడి గన్‌తో పైకి కాల్చుతూ ఆకతాయిలు హల్‌చల్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో వీడియోలు వైరల్ అవుతున్నాయి. ఫోటో షూట్ పేరుతో యువకులు విన్యాసాలకు పాల్పడుతున్నారు. ర్యాష్ డ్రైవింగ్ చేస్తూ స్టంట్లు చేస్తుండడంతో వాహన చోదకులు, స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. కేటీఎం, పల్సర్ 220 బైక్‌ల నంబర్ ప్లేట్లు తీసేసి రోడ్లపై రచ్చ రచ్చ చేస్తున్నారు. బెజవాడ పోలీసులు యువకులను గుర్తించేందుకు యత్నిస్తున్నారు. గన్ నకిలీదో ఒరిజినల్‌దో విచారణ చేస్తున్నారు.

ఇవి కూడా చదవండిImage Caption