హైదరాబాద్/అఫ్జల్‌గంజ్ : ర్యాష్ డ్రైవింగ్, అధిక శబ్దాలతో ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్న పోకిరీలకు గోషామహల్ ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ వెంకటేశ్వర్ యాదవ్ అడ్డుకట్ట వేశారు. పోలీసుల తనిఖీల్లో 25 బుల్లెట్ వాహనాలను స్వాధీనం చేసుకుని, కేసు నమోదు చేసి గోషామహల్ ట్రాఫిక్ పీఎస్‌కు తరలించారు.