Oct 24 2021 @ 17:08PM

Radheshyam: మళ్లీ ప్రభాస్‌దే రికార్డ్‌!

ఈ మధ్యకాలంలో ప్రేక్షకుల ముందుకొచ్చిన ‘సర్కారు వారి పాట’, ‘పుష్ప’, ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ టీజర్స్‌ ఎంతగా ప్రేక్షకాదరణ పొందాయో తెలిసిందే! ప్రభాస్‌ పుట్టినరోజున విడుదల చేసిన ‘రాధేశ్యామ్‌’ టీజర్‌ ఆ రికార్డులను తిరగరాసింది. విడుదలైన 24 గంటల్లో రికార్డుల మోత మోగించింది. దేశవ్యాప్తంగా చూస్తే టాప్‌ వ్యూస్‌ రికార్డుకు సమీప దూరంలో నిలిచింది. ఈ టీజర్‌ 52 మిలియన్ల మార్క్‌ చేరుకుంది. ప్రభాస్‌కు ఉన్న ఫాలోయింగ్‌ ఏంటనేది ‘రాధేశ్యామ్‌’ టీజర్‌ నిరూపించింది. ఇదే హయ్యస్ట్‌ రికార్డ్‌ అని చెప్పొచ్చు.

 

ప్రభాస్‌ గత చిత్రం ‘సాహో’ టీజర్‌ విడుదలైన 24 గంటల్లో 43.5 మిలియన్‌ వ్యూస్‌ సాధించింది. దాన్నీ ఇప్పుడు ‘రాధేశ్యామ్‌’ టీజర్‌ బీట్‌ చేసింది. దీన్ని బట్టి ప్రభాస్‌ రికార్డ్‌ని మళ్లీ ఆయనే తిరగరాశారు. ఈ మధ్యకాలంలో మరే చిత్రం టీజర్‌కు ఇంత స్పందన రాలేదు. ‘సర్కారు వారి పాట’ 23 మిలియన్స్‌, ‘పుష్ప’ 22.5 మిలియన్స్‌, ‘సరిలేరు నీకెవ్వరు’ (14.6 మిలియన్స్‌), ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ కొమురం భీమ్‌ టీజర్‌ 14.1 మిలియన్స్‌ సాధించాయి. దీన్నిబట్టి మన దేశ వ్యాప్తంగా చూస్తే ‘రాధే శ్యామ్‌’ టీజర్‌ వ్యూస్‌ పరంగా రెండో స్థ్థానంలో నిలిచింది. అంతకన్నా ముందు కన్నడ హీరో యష్‌ ‘కె.జి.యఫ్‌: 2’ టీజర్‌ ఉంది. ఆ టీజర్‌ విడుదలైన 24 గంటల్లో 68.8 మిలియన్స్‌ వ్యూస్‌ సాధించింది. ప్రభాస్‌ టీజర్‌ ఇంతగా ప్రేక్షకాదరణ పొందడం పట్ల మేకర్స్‌, అభిమానులు ఆనందంలో మునిగితేలుతున్నారు.