Abn logo
Dec 4 2020 @ 12:47PM

`ఆచార్య`లో రష్మిక ఫిక్సయిందా?

మెగాస్టార్ చిరంజీవి, స్టార్ డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న చిత్రం `ఆచార్య`. ఈ సినిమాలో మెగాపవర్‌స్టార్ రామ్ చరణ్ స్టూడెంట్ లీడర్‌గా కనిపించబోతున్నాడట. మెగాస్టార్ సరసన కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తోంది. అయితే చెర్రీ సరసన నటించే హీరోయిన్‌ను ఇంకా ఫిక్స్ చేయలేదు. 


సినిమాలో కనిపించేది కొద్దిసేపే అయినప్పటికీ ఆ పాత్రకు చాలా ప్రాధాన్యం ఉంటుందని తెలుస్తోంది. మొదట బాలీవుడ్ హీరోయిన్ కియారా ఆడ్వాణీని తీసుకోవాలనుకున్నారు. అయితే ఆమె డేట్లు క్లాష్ కావొచ్చనే ఉద్దేశంతో రష్మికను సంప్రదించినట్టు సమాచారం. ఆమె అంగీకరించినట్టు తెలుస్తోంది. వచ్చే ఏడాది మార్చి నెలలో రష్మిక షూటింగ్‌లో పాల్గొంటుందట. 


Advertisement
Advertisement
Advertisement