Sep 12 2021 @ 08:55AM

లేడీ ఓరియెంటెడ్ మూవీలో రష్మిక..?

ప్రస్తుతం తెలుగు, హిందీ చిత్రాలలో నటిస్తూ మంచి దూకుడు మీదున్న హీరోయిన్ రష్మిక మందన్న. త్వరలో ఓ లేడీ ఓరియెంటెడ్ మూవీలో నటించబోతుందనే లేటెస్ట్ న్యూస్ ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. 'అందాల రాక్షసి', 'టైగర్', 'అలా ఎలా' వంటి సినిమాలతో నటుడిగా మెప్పించిన రాహుల్ రవీంద్రన్.. 'చిలసౌ' చిత్రంతో దర్శకుడిగా మారాడు. ఈ సినిమా హిట్‌గా నిలిచింది. దాంతో నెక్స్ట్ సినిమాను నాగార్జునతో చేసే అవకాశం దక్కించుకున్నాడు. 'మన్మధుడు 2' అనే టైటిల్‌తో వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. ఈ క్రమంలో కాస్త గ్యాప్ తీసుకున్న రాహుల్ రవీంద్రన్, ప్రముఖ నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్2లో ఒక సినిమాకి దర్శకత్వం వహించే అవకాశం అందుకున్నాడు. ఇదొక లేడీ ఓరియెంటె మూవీ అని, ఇందులో స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న నటించే అవకాశలున్నాయని తెలుస్తోంది. ఇప్పటికే దర్శకుడు రష్మికకి కథ కూడా చెప్పాడట. త్వరలో ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించిన అఫీషియల్ కన్‌ఫర్మేషన్ రానుందని సమాచారం.