Apr 15 2021 @ 07:57AM

రష్మికని తల్లిదండ్రులే నమ్మలేదా..?

కన్నడ బ్యూటీ రష్మిక మందన్న స్టార్ హీరోయిన్స్‌తో పోటా పోటీగా సినిమాలు చేస్తోంది. టాలీవుడ్‌లో పూజా హెగ్డేతో పోటీ పడుతోంది. ప్రస్తుతం టాలీవుడ్‌లో టాప్ ప్లేస్‌లో ఉన్న హీరోయిన్స్ అంటే రష్మిక మందన్న, పూజా హెగ్డేనే. ఇక బాలీవుడ్‌లో పూజా హెగ్డే రెండు సినిమాలు చేసే అవకాశం అందుకుంటే తనకి పోటీగా రష్మిక మందన్న కూడా రెండు సినిమాలలో అవకాశం దక్కించుకుంది. వాటిలో ఒక సినిమా యంగ్ హీరో సిద్దార్థ్ మల్‌హోత్రా సరసన నటిస్తున్న 'మిషన్ మజ్ఞు' కాగా మరొక సినిమా బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్‌తో నటిస్తున్న 'గుడ్ బాయ్' సినిమా. రష్మికకి ఈ రెండు సినిమాలలో అవకాశం పెద్ద గ్యాప్ లేకుండా వచ్చాయి. ప్రస్తుతం షూటింగ్ కూడా అలాగే జరుగుతోంది.

అయితే తాజాగా రష్మిక మందన్న అమితాబ్‌తో నటిస్తున్న సినిమాకి సంబంధించిన ఒక ఆసక్తికరమైన విషయాన్ని అభిమానులతో షేర్ చేసుకుంది. రష్మికకి అమితాబ్‌తో కలిసి నటించే అవకాశం వచ్చిందంటే తన తల్లిదండ్రులే నమ్మలేకపోయారట. రష్మిక అమ్మా, నాన్న.. బిగి బికి బిగ్ ఫ్యాన్స్ అట. ఆయన సినిమాలన్నీ తప్పకుండా చూస్తుంటారట. అలాంటి లెజెండరీ నటుడితో తమ కూతురుకు స్క్రీన్ షేర్ చేసుకుంటుందన్న మాటని నమ్మలేకపోయారని చెప్పుకొచ్చింది.  మొత్తానికి రష్మిక సినిమా ఇండస్ట్రీకి వచ్చిన కొద్దికాలంలోనే అమితాబ్ సినిమాలో అవకాశం..అది కూడా ఆయన కూతురు పాత్రలో కనిపించబోతుందటం అంటే గొప్ప విషయం. కాగా తెలుగులో రష్మిక మందన్న అల్లు అర్జున్ సరసన 'పుష్ప' చేస్తోంది. సుకుమార్ దర్శకత్వంలో పాన్ ఇండియన్ సినిమాగా తెరకెక్కుతోంది.