వ్యవసాయ బిల్లును నిరసిస్తూ రాస్తారోకో

ABN , First Publish Date - 2020-09-26T09:20:02+05:30 IST

కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్‌లో రైతు వ్యతిరేక వ్యవసాయ బిల్లును ప్రవేశపెట్టి ఆమోదించిందని నిరసిస్తూ శుక్రవారం ఏలేశ్వరంలో అఖిల భారత

వ్యవసాయ బిల్లును నిరసిస్తూ రాస్తారోకో

కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ, బిల్లుల ప్రతులు దహనం 


ఏలేశ్వరం, సెప్టెంబరు 25: కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్‌లో రైతు వ్యతిరేక వ్యవసాయ బిల్లును ప్రవేశపెట్టి ఆమోదించిందని నిరసిస్తూ శుక్రవారం ఏలేశ్వరంలో అఖిల భారత కిసాన్‌ మహాసభ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. సీపీఐ (ఎంఎల్‌) లిబరేషన్‌ పార్టీ జిల్లా కార్యదర్శి కొసిరెడ్డి గణేశ్వరరావు, కిసాన్‌ మహాసభ నాయకుడు గుర్రం గోవిందు నాయకత్వం వహించారు. వ్యవసాయాన్ని కార్పొరేటీకరణ చేయడమే లక్ష్యంగా రైతులకు నష్టం చేకూర్చే విధంగా బిల్లులను తెచ్చారని రైతులు, కౌలు రైతులు నినాదాలు చేస్తూ పట్టణ వీధుల్లో ప్రదర్శన, బాలాజీచౌక్‌ సెంటర్‌లో రాస్తారోకో నిర్వహించారు. అనంతరం ప్రధాన ఆర్‌అండ్‌బీ రహదారిపై వ్యవసాయ బిల్లు ప్రతులు, కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. కార్యక్రమంలో మసకపల్లి ధనబాబు, జోగా ఈశన్న, మరువాడ భద్రం, కందుల త్రిమూర్తులు, కోన గంగ, వడియాల అప్పలరాజు, గుర్రం వీరబాబు తదితరులు పాల్గొన్నారు. 


తహశీల్దార్‌కు వినతి

జగ్గంపేట: కేంద్ర ప్రవేశపెట్టిన వ్యవసాయ బిల్లులను రద్దు చేయాలని కోరుతూ జగ్గంపేట తహశీల్దార్‌ వై.సరస్వతికి సీపీఐ ఎంఎల్‌ బహుజన ప్రజారాజ్యం, విప్లవకూలీ రైతు సంఘం ఆధ్వర్యంలో వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ కేంద్రం ఈ బిల్లులు వెనక్కి తీసుకునే వరకు పోరాటం చేస్తామని స్పష్టం చేశారు.

Updated Date - 2020-09-26T09:20:02+05:30 IST