Abn logo
Mar 2 2021 @ 00:35AM

వంతెన నిర్మాణ పనుల్లో జాప్యం నిరసిస్తూ రాస్తారోకో

కథలాపూర్‌, ఫిబ్రవరి 1 : తక్కళ్లపల్లి-సిరికొండ గ్రామాల మధ్య పెద్ద వాగుపై నిర్మిస్తున్న వంతెన నిర్మాణ పనుల్లో జాప్యం నిరసిస్తూ సోమవా రం మండలంలోని సిరికొండలో బీజెపీ శ్రేణులు రాస్తారోకో నిర్వహించా యి. నాలుగున్నర సంవత్సరాలు గడిచినా ప్రభుత్వం వంతెనను పూర్తి చే యడంలో విఫలమైందని ఆరోపించారు. వంతెనకు రు. 6 కోట్లు మంజూ రు చేసి కేవలం కోటిన్నర రూపాయలు మాత్రమే విడుదల చేయడం దా రుణమన్నారు. స్థానిక ఎమ్మెల్యే వైఫల్యం వల్లే పనులు జరగని పరిస్థితి నెలకొందన్నారు. అనంతరం వంతెన వద్ద నిరసన వెలిబుచ్చారు. ఈ కార్య క్రమంలో జిల్లా కిసాన్‌ మోర్చా అధ్యక్షుడు కొడిపల్లి గోపాల్‌రెడ్డి, జిల్లా ఉ పాధ్యక్షుడు ఎడ్మల వినోద్‌రెడ్డి, మండల అధ్యక్షుడు కంటె సత్యనారాయణ, బండ అంజయ్య, శ్రీనివాస్‌, వెంకటేశ్వర్‌రావు, జిల్లా రాజు, మల్యాల మారు తి, నరెడ్ల రవి ఉన్నారు.

Advertisement
Advertisement