లెన్స్‌కార్ట్‌ నుంచి రతన్ టాటా పెట్టుబడుల ఉపసంహరణ!

ABN , First Publish Date - 2021-03-01T03:45:20+05:30 IST

Ratan Tata to exit from IPO-bound startup Lenskart

లెన్స్‌కార్ట్‌ నుంచి రతన్ టాటా పెట్టుబడుల ఉపసంహరణ!

ముంబై: ప్రముఖ పారిశ్రామిక వేత్త రతన్ టాటా లెస్స్‌కార్ట్ నుంచి తన పెట్టుబడులు ఉపసంహరించుకోనున్నారు. 2016లో ఆయన ఈ సంస్థలో ఇన్వెస్ట్ చేశారు. అప్పట్లో రతన్ టాటాకు లెన్స్‌కార్ట్.. రూ. 2 ఫేస్ వ్యాల్యూ కలిగిన 24,246 ఈక్విటీ షేర్లను కేటాయించింది. తాజాగా రతన్ టాకా ఈ పెట్టుబడిని ఉపసంహరించుకునేందుకు సిద్ధమైనట్టు తెలుస్తోంది. రతన్ టాటా అభ్యర్థన మేరకు.. ఆయనకు కేటాయించిన ప్రిఫరెన్షియల్ షేర్లను కనర్వట్ చేసేందుకు ఉద్దేశించిన తీర్మానాన్ని సంస్థ బోర్డు ఆమోదించిందని సమాచారం. అయితే..చేసిన ఇన్వెస్ట్‌మెంట్‌పై రతన్ టాటా 28 రెట్లు అధికంగా ప్రతిఫలం పొందబొతున్నట్టు సమాచారం. ఇక ప్రస్తుతం సంస్థలో పెట్టుబడులు పెట్టిన ఇన్వెస్టర్లే టాటా షేర్లను చేజిక్కించుకుంటారని జాతీయ మీడియా వర్గాల కథనం. 2016 నాటి వార్తా కథనాల ప్రకారం.. అప్పట్లో రతన్ టాటా లెన్స్‌కార్టులో రూ. 10 లక్షల పెట్టుబడి పెట్టారు. 

Updated Date - 2021-03-01T03:45:20+05:30 IST