ప్రతి పనికీ రేటు

ABN , First Publish Date - 2021-06-15T05:17:49+05:30 IST

కొందరు సిబ్బంది ప్రతి పనికీ రేటు నిర్ణయించి వసూలు చేస్తున్నారని బాధితుల బంధువులు చెబుతున్నారు.

ప్రతి పనికీ రేటు
రోగికి ఆక్సిజన్‌ పెట్టినందుకు ప్రతిఫలం

ఆసుపత్రిలో ఉన్నవారు వైరస్‌తో పోరాడుతూ ఉంటే, బయట ఉన్న కుటుంబసభ్యులు లోపలున్నవారి ఆరోగ్య సమాచారం కోసం తీవ్ర ఆందోళనకు గురవుతూ ఉంటారు. ఈ ఆందోళనే స్విమ్స్‌ పద్మావతి కొవిడ్‌ ఆసుపత్రిలో కిందిస్థాయి సిబ్బందికి కాసుల వాన కురిపిస్తోంది.లోపలున్న బాధితులకు మందులు పంపాలన్నా, ఇంటి నుంచి తెచ్చిన ఆహారం అందించాలన్నా, ఎలా ఉన్నారో తెలుసుకోవాలనుకున్నా..లోపలకూ, బయటకూ తిరిగే సిబ్బంది మీదే ఆధారపడుతున్నారు. ఈ సాయం చేసేవారికి కృతజ్ఞతతో ఎంతో కొంత చేతిలో పెడుతుంటారు. దీన్ని ఆసరాగా తీసుకుని కొందరు సిబ్బంది ప్రతి పనికీ రేటు నిర్ణయించి వసూలు చేస్తున్నారని బాధితుల బంధువులు చెబుతున్నారు. చేతుల్లో నోట్లు పెట్టకపోతే తాము పంపినవేవీ వెంటనే అందవని, బరువు పెరిగేకొద్దీ వేగం పెరుగుతుందని చెబుతున్నారు. ప్రతి పూటా ఈ చెల్లింపులతో సతమతమవుతున్నామని వాపోతున్నారు. ఆంధ్రజ్యోతి  ప్రతినిధి కంటబడ్డ కొన్ని దృశ్యాలు ఇవి.. స్విమ్స్‌ ఉన్నతాధికారులు కాస్త శ్రద్ధ పెడితే ఈ వసూల్‌ దందాలకు చెక్‌పెట్టడం పెద్ద కష్టం కాదు. 

-తిరుపతి సిటీ






Updated Date - 2021-06-15T05:17:49+05:30 IST