రతన్ ‘పోస్ట్‌’... వైరల్‌

ABN , First Publish Date - 2021-09-08T20:39:59+05:30 IST

దిగ్గజ పారిశ్రామికవేత్త, టాటా గ్రూప్ మాజీ ఛైర్మన్ తాజాగా తన వ్యక్తిగత ఇష్టానికి సంబంధించి... షేర్‌ చేసిన ఓ ఆసక్తికరమైన విషయంతో ఆయన అభిమానులు ఫిదా అవుతున్నారు.

రతన్ ‘పోస్ట్‌’... వైరల్‌

ముంబై : దిగ్గజ పారిశ్రామికవేత్త, టాటా గ్రూప్ మాజీ ఛైర్మన్   తాజాగా తన వ్యక్తిగత ఇష్టానికి సంబంధించి... షేర్‌ చేసిన ఓ  ఆసక్తికరమైన విషయంతో ఆయన అభిమానులు ఫిదా అవుతున్నారు. తాను పియానో వాయిస్తున్న చిత్రాన్ని ఇన్‌స్టాగ్రామ్‌లో  పోస్ట్‌ చేశారు. చిన్నప్పటినుంచి తనకు పియానో వాయించడమంటే ఇష్టమని పేర్కొన్నారు. వ్యాపార రంగంలో చాలా బిజీగా ఉండటంతో పియానో వాయించడం   సాధ్యపడలేదన్నారు. కాగా... పదవీవిరమణ అనంతరం... పియానో నేర్చుకునేందుకు మంచి టీచర్‌ దొరికినప్పటికీ... దానిపై శ్రద్ధ పెట్టలేకపోయానని తెలిపారు. రానున్న రోజుల్లో మరోసారి ప్రయత్నించాలని ఆశపడుతున్నట్టు తన పోస్ట్‌లో పేర్కొన్నారు. ఈ క్రమంలో పెద్దసంఖ్యలో నెటిజన్లు తమ కమెంట్లతో టాటాపై తమ గౌరవాన్ని చాటుకుంటున్నారు.

Updated Date - 2021-09-08T20:39:59+05:30 IST