డీహైడ్రేట్‌ కాకుండా..!

ABN , First Publish Date - 2021-04-04T05:30:00+05:30 IST

వేసవిలో శరీరం త్వరగా డీహైడ్రేట్‌ అవుతుంది. అయితే కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా శరీరంలోని నీటి శాతం

డీహైడ్రేట్‌ కాకుండా..!

వేసవిలో శరీరం త్వరగా డీహైడ్రేట్‌ అవుతుంది. అయితే కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా శరీరంలోని నీటి శాతం తగ్గిపోకుండా చూసుకోవచ్చు. 


 ఉదయాన రెండు గ్లాసుల నీళ్లతో దినచర్య ప్రారంభించాలి. శరీరంలో పేరుకుపోయిన టాక్సిన్స్‌ బయటకు వెళ్లడానికి ఇది సహాయపడుతుంది. అంతేకాకుండా రోజంతా యాక్టివ్‌గా ఉంచుతుంది. 


 నిమ్మరసం, కొబ్బరి నీళ్లు, ఆమ్‌ పన్నా లాంటి డ్రింక్‌లు తీసుకోవచ్చు. నీళ్లలో పుదీనా ఆకులు వేసి, ఉదయాన్నే ఆ నీటిని తాగితే మంచి ఫలితం ఉంటుంది.


 వేసవికాలంలో శరీరంలో ఉష్ణోగ్రత బాగా పెరుగుతుంది. అందుకే పండ్లు బాగా తినాలి. పండ్లలో క్యాలరీలు తక్కువగా ఉంటాయి. విటమిన్లు, మినరల్స్‌ అధికంగా లభిస్తాయి. వాటర్‌మెలన్‌, ఖర్బూజ, మామిడిపండు, గ్రేప్స్‌లాంటివి తీసుకోవచ్చు. 


 హెవీ మీల్స్‌ కాకుండా, వెజిటబుల్స్‌ ఎక్కువగా తీసుకోవాలి. పొట్ట ఫుల్‌గా అయ్యేలా తినకూడదు. ప్రొటీన్‌ అధికంగా లభించే ఆహారాన్ని తక్కువ మోతాదులో తినాలి. 


 అవుట్‌డోర్‌లో వ్యాయామం చేస్తున్నట్లయితే చెమట రూపంలో నీటిని కోల్పోతుంటారు. దాన్ని భర్తీ చేయడం కోసం ఎలకో్ట్రలైట్‌ పౌడర్‌, గ్లూకోజ్‌ నీళ్లు తీసుకోవాలి.


Updated Date - 2021-04-04T05:30:00+05:30 IST