నేటి నుంచి రేషన్‌

ABN , First Publish Date - 2020-12-05T05:06:22+05:30 IST

ఉచిత రేషన్‌ ముగిసింది. ఇక నుంచి డబ్బులు చెల్లించి సరుకులు తీసుకోవాల్సి ఉంటుంది.

నేటి నుంచి రేషన్‌

ఉచితం కాదు.. సొమ్ములు చెల్లించాలి

బియ్యం, కందిపప్పు, పంచదార సరుకులు పంపిణీ

రేషన్‌ డిపోలకు సరఫరా చేస్తున్న సరుకులు

ఏలూరు సిటీ, డిసెంబరు 4 : ఉచిత రేషన్‌ ముగిసింది. ఇక నుంచి డబ్బులు చెల్లించి సరుకులు తీసుకోవాల్సి ఉంటుంది. కొవిడ్‌–19 నేపథ్యంలో ఈ ఏడాది ఏప్రిల్‌ నుంచి నవంబరు వరకు నెలకు రెండు సార్లు చొప్పున ఉచితంగా 16 విడతలపాటు బియ్యం, కందిపప్పు, సెనగలను సరఫరా చేశారు. ఇక నుంచి సాధారణ పద్ధతిలో నగదు తీసుకుని బియ్యం, కంది పప్పు, పంచదార సరుకులు కార్డుదారులకు అందించా లని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రతి కార్డులో ఒక్కో సభ్యుడికి ఐదు కిలోల బియ్యం, కార్డుకు కిలో కంది పంపు, అరకేజీ పంచదార అందజేస్తారు. బియ్యం కిలో రూపాయి, కందిపప్పు రూ.67, పంచదార అరకేజి రూ.17కు అందిస్తుండగా, ఏఏవై కార్డులకు కిలో పంచ దార రూ.13కు అందజేయనున్నారు. జిల్లాలో 2,200 చౌక డిపోలకు బియ్యం 17 వేల టన్నులు, కందిపప్పు 1,200 టన్నులు, పంచదార 600 టన్నులు కేటాయించామని సివిల్‌ సప్లయిస్‌ డీఎం డి.రాజు తెలిపారు. కొవిడ్‌ నియంత్రణలో భాగంగా చౌక డిపోల ఆవరణలో రెండు మీటర్లు భౌతిక దూరం పాటించేలా, శానిటైజర్‌, సబ్బు, నీళ్లు అందు బాటులో ఉండేలా డీలర్లు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించా రు. అయితే ఈసారి రెండు వేలిముద్రలు వేసి రేషన్‌కార్డుదారులు సరుకులు తీసుకోవాల్సి ఉంది.  


డిపోలకు చేరని సరుకులు

రేషన్‌ సరుకులు ఇంకాపూర్తిగా డిపోలకు చేరలేదు. ఇప్పటి వరకు 30 శాతం మాత్రమే సరుకులు సరఫరా అయ్యాయని అధికారులు చెబుతున్నారు. ఈ సారైనా పూర్తి స్థాయిలో సరుకులు సరఫరా అవుతాయా లేదా అన్న విషయం సందేహమే. రెండు విడతల్లో ఉచి త రేషన్‌ పంపిణీలో సర్వర్‌ సమస్య, రేషన్‌ సరుకులు కొరత పట్టి పీడించాయి. దీంతో అప్పట్లో రేషన్‌ సరుకు లు పంపిణీలో కార్డుదారుల తోపాటు డీలర్లు ఇక్కట్లకు గురయ్యారు. కొవిడ్‌–19 విజృం భించడంతో అప్పట్లో ఉన్న మొత్తం కార్డులకు ఉచిత రేషన్‌ అందించారు. ఈసారి రద్దయిన కార్డులకు రేషన్‌ అందుతుం దా లేదా అనే విషయంపై స్పష్టత రాలేదు. 

Updated Date - 2020-12-05T05:06:22+05:30 IST