Advertisement
Advertisement
Abn logo
Advertisement

75 టన్నుల రేషన్‌ బియ్యం పట్టివేత

హనుమాన్‌జంక్షన్‌, నవంబరు 30 : అక్రమంగా రవాణా చేస్తున్న  మూ డు రేషన్‌ బియ్యం లారీలను మంగళవారం హనుమాన్‌జంక్షన్‌ పోలీసులు పట్టుకున్నారు. ఖమ్మం నుంచి కాకినాడ వైపు  మూడు లారీల్లో  రేషన్‌ బియ్యం  వెళుతున్నట్టు పక్కా సమాచారం అందడంతో సీఐ కె. సతీష్‌ తన సిబ్బందితో కలిసి హనుమాన్‌జంక్షన్‌ సెంటర్‌లో మూడు లారీలను పట్టుకుని 75 టన్నుల బియ్యంను స్వాధీనం చేసుకున్నారు. ఒక్కొక్కలారీలో 25 టన్నుల బియ్యం ఉన్నట్టు సీఐ తెలిపారు. నిందితులను అదుపులోకి తీసుకుని సివిల్‌ సప్లై అధికారులకు సమాచారం ఇచ్చినట్లు తెలిపారు. 

Advertisement
Advertisement