అర్హులందరికీ రేషన్‌ కార్డులు

ABN , First Publish Date - 2020-05-31T09:41:27+05:30 IST

అర్హులైన ప్రతి నిరుపేదలకు రేషన్‌ కార్డులు ఇప్పిస్తామని కార్మిక ఉపాధి కల్పన శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి

అర్హులందరికీ రేషన్‌ కార్డులు

మంత్రి చామకూర మల్లారెడ్డి


శామీర్‌పేట రూరల్‌: అర్హులైన ప్రతి నిరుపేదలకు రేషన్‌ కార్డులు ఇప్పిస్తామని కార్మిక ఉపాధి కల్పన శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి హామీ ఇచ్చారు. శనివారం మూడుచింతలపల్లి మండలం ఉద్దెమర్రిలో గ్రామస్థుల ద్వారా సేకరించిన రేషన్‌ బియ్యాన్ని మంత్రి చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో డీసీఎంఎస్‌ వైస్‌చైర్మన్‌ మధుకర్‌రెడ్డి, ఎంపీపీ హారిక, సర్పంచ్‌ అనురాధ, ఎంపీటీసీ సుగుణ, ఉపసర్పంచ్‌ కృష్ణారెడ్డి, నాయకులు విష్ణుగౌడ్‌, రవీందర్‌రెడ్డి, శ్రవన్‌కుమార్‌, వెంకటేష్‌, సంజీవ్‌యాదవ్‌, నవీన్‌, మధు, నర్సింహా, అంజనేయులు, మద్దుల శ్రీనివా్‌సరెడ్డి పాల్గొన్నారు. 


 రైతుల మేలు కోరే సీఎం కేసీఆర్‌

 రైతుల మేలు కొరకు సీఎం నియంత్రిత పంటల సాగు విధానాలను రూపొందించారని మంత్రి మల్లారెడ్డి అన్నారు. మూడుచింతలపల్లి మండలంలోని మూడుచింతలపల్లి, నాగిశెట్టిపల్లిలో శనివారం  వ్యవసాయ సాగు విధానాలపై రైతులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో డీసీఎంఎస్‌ వైస్‌ చైర్మన్‌ మధుకర్‌రెడ్డి, ఎంపీపీ హారిక, ఆర్‌ఎ్‌సఎస్‌ మండల కన్వీనర్‌ అంజనేయులు, సర్పంచ్‌లు జాం రవి, కృపాకర్‌రెడ్డి, సింగం అంజనేయులు, ఆర్‌ఎ్‌సఎస్‌ కన్వీనర్‌ గోపాల్‌రెడ్డి, కోఆప్షన్‌ సభ్యుడు నర్సింలు రైతులు పాల్గొన్నారు. 


అస్పత్రిలో సౌకర్యాల కల్పనకు చర్యలు 

శామీర్‌పేట: అస్పత్రిలో అవసరమైన అన్ని సౌకర్యాలను ఏర్పాటు చేస్తామని మంత్రి మల్లారెడ్డి అన్నారు. శామీర్‌పేటలోని రాజీవ్‌ రహదారి, ప్రభుత్వ ప్రాథమిక అస్పత్రి ఎదుట సర్పంచ్‌ బాలమణి పెద్ద ఎత్తున హరితహారం పనులను చేయిసున్నారు. శనివారం పనులను, అస్పత్రిని మంత్రి సందర్శించి పరిశీలించారు. శామీర్‌పేట పీహెచ్‌సీలో గల మరుగుదొడ్లను టైల్స్‌, ట్యాప్‌లతో ఆధునీకరించి నిరంతరం పరిశుభ్రంగా ఉండేలా తీర్చిదిద్దుతామని చెప్పారు. మంత్రి వెంట డీఎంహెచ్‌వో వీరాంజనేయులు, అస్పత్రి ఇన్‌చార్జి వైద్యాధికారి మనుపప్పన్‌, ఎంపీపీ ఎల్లూబాయి, జడ్పీటీసీ అనిత, సర్పంచ్‌ బాలమణి, టీఆర్‌ఎస్‌ మండల అఽధ్యక్షుడు సుదర్శన్‌ ఉన్నారు. 

Updated Date - 2020-05-31T09:41:27+05:30 IST