కష్టకాలంలో రేషన్‌ తిప్పలు

ABN , First Publish Date - 2021-05-06T06:21:59+05:30 IST

కరోన ముప్పు దూసుకెళ్తోంది. అయితే బుధవారం నుంచి కర్ఫ్యూ ఆంక్షలు అములోకి వచ్చాయి. అయినా చౌకధన్య డిపోలవద్ద బియ్యం కోసం కార్డుదారులు గంటల తరబడి ఒకేచోట గుమిగూడాల్సిన పరిస్థితి నెలకొంది.

కష్టకాలంలో రేషన్‌ తిప్పలు
చౌకధాన్య డిపోవద్ద గుమిగూడిన జనం


కర్ఫ్యూ సమయంలో కానరాని ‘ఇంటి వద్దకే రేషన్‌’ పథకం

హిందూపురం టౌన్‌, మే 5: కరోన ముప్పు దూసుకెళ్తోంది. అయితే బుధవారం నుంచి కర్ఫ్యూ ఆంక్షలు అములోకి వచ్చాయి. అయినా చౌకధన్య డిపోలవద్ద బియ్యం కోసం కార్డుదారులు గంటల తరబడి ఒకేచోట గుమిగూడాల్సిన పరిస్థితి నెలకొంది. దీనివల్ల కరోనా విజృంభణకు కారణం అవుతోంది. ఇంటివద్దకే రేషన్‌ పంపిణీ చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం ఆర్భాటంగా ప్రకటించారు. అయితే ఆ ప్రక్రియ క్షేత్రస్థాయిలో ఒక నెలకూడా సజావుగా సాగలేదన్నది నగ్నసత్యం. దీంతో కార్డుదారులు ఒకటో తేదీ నుంచి 5వరకు ఇంటివద్దకే రేషన్‌ వస్తుందని ఎదురు చూశారు. రాకపోవడంతో చేసేదిలేక లాక్‌డౌన్‌ వస్తే మా పరిస్థితి ఏమిటని చౌకధాన్య డిపోలవద్దకు వెళ్లి రేషన్‌ తీసుకుంటున్నారు. పట్టణంలో 22 వాహనాలు ఉండగా ఇందులో నలుగురైదుగురికి ఆపరేటర్లకు కరోనా సోకింది. దీంతో మిగిలిన ఆపరేటర్లు కూడా ఇళ్లవద్దకు వెళ్లి బియ్యం సరఫరా చేయడానికి జంకే పరిస్థితి నెలకొంది. దీంతో బియ్యం వాహన ఆపరేటర్లు ముందుకు రాలేదు. చేసేదిలేక స్టోర్ల వద్దే బియ్యాన్ని అందజేస్తున్నారు. దీంతో రేషన్‌షాపులవద్ద జనం బారులు తీరుతున్నారు. అదికూడా అక్కడ మిషన్‌ పనిచేయకపోవడంతో గంటల త రబడి అకేచోట జనం గుమిగూడుతున్నారు. దీనివల్ల ఎక్కడ కరోనా సోకుతుందోనని జంకే పరిస్థితి నెలకొంది. ఇప్పటికైనా సంబంధిత అధికారులు చొరవచూపి కార్డుదారులకు ఇంటివద్దకే బియ్యం అందేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. 


Updated Date - 2021-05-06T06:21:59+05:30 IST