రెండు వేలిముద్రల విధానం వద్దంటూ డీలర్ల నిరసన

ABN , First Publish Date - 2020-10-25T07:03:09+05:30 IST

సరుకుల పంపిణీలో రెండు వేలిముద్రల విధానాన్ని రద్దుచేయాలని డిమాండు చేస్తూ జిల్లాలోని రేషన్‌ డీలర్లం తా తహశీల్దార్‌ కార్యాలయాల ఎదుట నిరసన వ్యక్తంచేశారు.

రెండు వేలిముద్రల విధానం  వద్దంటూ డీలర్ల నిరసన
రేషన్‌ డీలర్ల నిరసన


ముమ్మిడివరం,అక్టోబరు 24: రేషన్‌ సరుకుల పంపిణీలో రెండు వేలిముద్రల విధానాన్ని రద్దుచేయాలని డిమాండు చేస్తూ జిల్లాలోని రేషన్‌ డీలర్లం తా తహశీల్దార్‌ కార్యాలయాల ఎదుట నిరసన వ్యక్తంచేశారు.  ముఖ్యంగా ముమ్మిడివరం డీలర్లసంఘ అధ్యక్షుడు గుద్దటి సుబ్బారావు ఆధ్వర్యంలో మండలంలోని 49 మంది డీలర్లు శనివారం తహశీల్దార్‌ కార్యాలయానికి వెళ్లి ఈ-పోస్‌ మిషన్లు చేతబట్టి నిరసన వ్యక్తంచేశారు. కరోనా వైరస్‌ కారణంగా వినియోగదారులకు, డీలర్లకు ఎటు వంటి ఇబ్బందులు లేకుండా ఒకే వేలిముద్రతో అన్ని సరుకులు పంపిణీ విధానాన్ని అమలుచేయాలన్నారు. సర్వర్ల సా మర్థ్యాన్ని వేగవంతంచేయాలని, డీలర్ల కమిషన్లు అన్నీ బ్యాంకు అక్కౌంట్లలో జమచేయాలని, కరోనా బీమా వర్తింపజేయాలని తదితర డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని తహశీల్దార్‌ యడ్ల రాంబాబుకు అందజేశారు.

 

Updated Date - 2020-10-25T07:03:09+05:30 IST