డీలర్ల ధర్నా

ABN , First Publish Date - 2021-10-27T04:51:05+05:30 IST

డోన్‌ పట్టణ సమీపంలోని ఎంఎల్‌ఎస్‌ స్టాకు పాయింటు వద్ద రేషన్‌ డీలర్లు మంగళవారం ధర్నా చేపట్టారు.

డీలర్ల ధర్నా
డోన్‌లో ధర్నా చేస్తున్న డీలర్లు

డోన్‌, అక్టోబరు 26: డోన్‌ పట్టణ సమీపంలోని ఎంఎల్‌ఎస్‌ స్టాకు పాయింటు వద్ద రేషన్‌ డీలర్లు మంగళవారం ధర్నా చేపట్టారు. డోన్‌ డీలర్ల అసోసియేషన్‌ అధ్యక్షుడు సుదర్శన్‌ రెడ్డి, ఉపాధ్యక్షుడు షేక్షావలి మాట్లాడుతూ ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబరు 10ని రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. డీలర్లకు బకాయి ఉన్న కమీషన్‌ను వెంటనే చెల్లించాలన్నారు. ఖాళీ గోనెసంచులను డీలర్లకే ఇచ్చేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు.  డీలర్లు దారా ప్రతాప్‌ రెడ్డి, ఓబులేసు, రవిరెడ్డి, గోసానిపల్లె మల్లయ్య, నాయుడు, రఘు తదితరులు పాల్గొన్నారు.


పత్తికొండ: తమ సమస్యలను వెంటనే పరిష్కరించాలని పత్తికొండ డీలర్ల సంఘం నాయకులు సోమశేఖర్‌, ప్రసాద్‌ కోరారు. సివిల్‌ సప్లయ్‌ గోదాము వద్ద పత్తికొండ ప్రాంత రేషన్‌ డీలర్లు మంగళవారం నిరసన చేపట్టారు. కార్యక్రమంలో డీలర్ల సంఘం నాయకులు, డీలర్లు పాల్గొన్నారు. 


వెల్దుర్తి: ప్రభుత్వం ఇచ్చే కమీషన్‌తో దుర్భర జీవనం సాగిస్తున్నామని, ప్రభుత్వం రేషన్‌ డీలర్లను ఆదుకోవాలని వెల్దుర్తి మండల రేషన్‌ డీలర్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు వీఎం గోపీనాథ్‌ డిమాండ్‌ చేశారు. వెల్దుర్తి ఎంఎల్‌ఎస్‌ పాయింట్‌ వద్ద వెల్దుర్తి, క్రిష్ణగిరి మండల డీలర్లతో కలిసి ధర్నా చేపట్టారు. వారు మాట్లాడుతూ ప్రజాపంపిణీ వ్యవస్థ ఏర్పడినప్పటి నుంచి ఖాళీ గోనెసంచులను డీలర్లు అమ్ముకుని దుకాణాల అద్దెలు, ఎగమతి దిగుమతి, హమాలీ కూలీల ఖర్చులు, కరెంటు బిల్లులు, గుమాస్తా జీతం చెల్లించుకునేవారమని తెలిపారు. అయితే ఖాళీ గోనెసంచులను ప్రభుత్వం తిరిగి అప్పజెపాలని చెప్పడం దారుణమన్నారు. దీని వల్ల ఆర్థికంగా నష్టపోతామన్నారు. రేషన్‌ డీలర్లు సంఘం నాయకులు, డీలర్లు కోటేశ్వరరెడ్డి, శ్రీను, ఆచారి, ప్రభాకర్‌, కాంతన్న, చెన్న కృష్ణ తదితరులు పాల్గొన్నారు.



Updated Date - 2021-10-27T04:51:05+05:30 IST