రేపటి నుంచి ‘రేషన్‌’

ABN , First Publish Date - 2020-07-17T11:17:52+05:30 IST

కరోనా కట్టడి కోసం లాక్‌డౌన్‌ కొనసాగుతుండటంతో మరో విడత బియ్యం, శనగలు ఉచితంగా పంపిణీకి శ్రీకారం చుట్టా రు.

రేపటి నుంచి ‘రేషన్‌’

బియ్యం, శనగలు ఉచితం

ఏఏవై కార్డులకు కోటా తగ్గింపు

కమీషన్‌ కోసం డీలర్ల ఎదురుచూపులు


ఒంగోలు(కలెక్టరేట్‌), జూలై 16 : కరోనా కట్టడి కోసం లాక్‌డౌన్‌ కొనసాగుతుండటంతో మరో విడత బియ్యం, శనగలు ఉచితంగా పంపిణీకి శ్రీకారం చుట్టా రు. మార్చి 22వ తేదీన జనతా కర్ఫ్యూ అనంతరం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లాక్‌డౌన్‌ ప్రకటించాయి. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి రాష్ట్రంలోని రేషన్‌ కార్డుదారులందరికీ నెలకు రెండు విడతలు ఉ చితంగా రేషన్‌ బియ్యం పంపిణీ చేస్తామని ప్రకటిం  చారు. ఇప్పటి వరకు  ఏడు విడతలు పంపిణీ చేయ గా ఎనిమిదో విడత శనివారం నుంచి పంపిణీ చేయ నున్నారు. జిల్లావ్యాప్తంగా 10 లక్షలకు పైగా రేషన్‌ కా ర్డుదారులు ఉండగా, ఒక్కొక్కరికి 5 కిలోల బియ్యం, కార్డుకు కిలో శనగలను ఉచితంగా అందజేస్తారు. 


షాపులకు చేరిన బియ్యం 

జిల్లాలోని 2151 రేషన్‌ షాపులకు బియ్యం, శనగల ను సరఫరా చేశారు. బయోమెట్రిక్‌ విధానంలో కార్డు దారులకు అందజేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. ఏడో విడత ఈనెల 3వతేదీ నుంచి పంపిణీ చేయగా, ఎనిమిదవ విడత పంపిణీ శనివారం నుంచి ప్రారంభం కానుంది. కాగా అంత్యోదయ కార్డులకు కేం ద్ర ప్రభుత్వం ఉచితంగా బియ్యం  పంపిణీ చేస్తుంది. ఆ కార్డులో ఎంత మంది వ్యక్తులు పేర్లు ఉన్నా నెలకు 35 కిలోలు ఉచితంగా ఇస్తారు. అయితే ఈ పర్యా యం ఏఏవై కార్డులో ఎంత  మంది పేర్లు ఉంటే ఒ క్కొక్కరికి ఐదు కిలోల చొప్పున ఉచితంగా బియ్యం అందజేయనున్నారు.


కమీషన్ల కోసం పడిగాపులు

ప్రభుత్వ ఆదేశాలతో రేషన్‌ కార్డుదారులకు ఉచితం గా బియ్యం, కందిపప్పు, శనగలు పంపిణీ చేసిన డీల ర్లకు కమీషన్‌ ఇవ్వని పరిస్థితి ఏర్పడింది. కార్డుదారు లకు ఇచ్చే సరుకులకు ప్రభుత్వం కిలోకు రూపాయి చోప్పున కమీషన్‌ ఇస్తుంది. ఆ విధంగా నెలకు ఒక్కొ క్క రేషన్‌ షాపు డీలరుకు రూ.10 నుంచి రూ.12వేల వరకు ఆదాయం వస్తుంది. దాని ద్వారానే అద్దెతో పా టు షాపులో పనిచేసే వర్కర్లకు వేతనాలు ఇస్తారు. అ యితే ఏడు విడతల కమీషన్‌ ఇవ్వాల్సి ఉండగా ఇప్ప టి వరకు కేవలం రెండు విడతల కమీషన్‌ ఇచ్చి ఐదు విడతల సొమ్మును పెండింగ్‌లో ఉంచింది. ఆ విధం గా ఒక్కొక్క డీలర్‌కు ప్రభుత్వం నుంచి సుమారు రూ.50 నుంచి రూ.60వేల వరకు రావాల్సి ఉంది.


శానిటైజర్లు ఇవ్వని వైనం

కరోనా నియంత్రణ కోసం లాక్‌డౌన్‌ కొనసాగుతు న్నా రేషన్‌షాపులో సరుకులు తీసుకొనేందుకు కార్డు దారులు బయోమెట్రిక్‌ మిషన్‌లో వేలిముద్రాలు వే యాల్సి ఉంది. అయితే అందుకు అవసరమైన శాని టైజర్లను ప్రభుత్వం ప్రారంభంలో ఇచ్చి చేతులు దులుపుకుంది. కానీ ప్రస్తుతం శానిటైజర్లు, మాస్కులు ఇవ్వని కారణంగా డీలర్లు కూడా ఏమి చేయలేని ప రిస్థితి ఏర్పడింది.  దీంతో కార్డుదారులు ఎక్కడ కరోనా వైరస్‌ వ్యాప్తి చెందుతుందోనని ఆందోళన వ్యక్తం చే స్తున్నారు.

Updated Date - 2020-07-17T11:17:52+05:30 IST