రైస్‌ మిల్లుల్లో రేషన్‌ దందా

ABN , First Publish Date - 2021-07-30T04:41:06+05:30 IST

వనపర్తి జిల్లాలో రైస్‌ మి ల్లుల్లో రేషన్‌ బియ్యం ఆక్రమదందా మూడు పువ్వు లు ఆరు కాయలు అన్న చందంగా కొనసాగుతోం ది.

రైస్‌ మిల్లుల్లో రేషన్‌ దందా
అమరచింత మండలంలో పట్టుబడ్డ రేషన్‌ బియ్యం (ఫైల్‌)

పెబ్బేరు, జూలై 29: వనపర్తి జిల్లాలో రైస్‌ మి ల్లుల్లో రేషన్‌ బియ్యం ఆక్రమదందా మూడు పువ్వు లు ఆరు కాయలు అన్న చందంగా కొనసాగుతోం ది. ఆక్రమదందాలు నిరంతరం జరుగుతున్నా అధి కారులు  పట్టించుకోవడం లేదనే ఆరోపణలు  విని పిస్తున్నాయి. దీంతో ఫౌరసరఫరాల అధికారులకు మిల్లుల యజమాలనుకు లోపాయికారి ఒప్పందం ఉందనే ఆరోపణలు వస్తున్నాయి. జిల్లాలోని అన్ని మండలల్లో రేషన్‌ బియ్యాన్ని కొందరు కొను గోలు చేసి మిల్లులకు తరలిస్తున్నారు. మిల్లుల యజమా నులు అక్రమంగా బియ్యాన్ని తరలిస్తూ పట్టు బ డుతున్నారు. అయినా వారిపై అధికారులు గట్టి చర్యలు తీసుకోకపోవడంతోనే దందా కొనసా గుతు న్నదనే ఆరోపణలు వస్తున్నాయి. తూతూ మంత్రం గా దాడులు నిర్వహించి ఆక్రమ బియ్యాన్ని పట్టుకొ ని మిల్లులను సీజ్‌ చేసిన  మరుసటి రోజునే తిరిగి తెరుస్తూ మళ్లీ ఆక్రమ దందాను కొనసాగిస్తున్నా రు. వనపర్తి జిల్లాలో ఈ మధ్యనే పలుచోట్ల రేషన్‌ బియ్యాన్ని ఆక్రమ తరలిస్తూ పట్టుబడ్డారు. పెబ్బే రులో సత్యసాయి రైస్‌ మిల్లులో 150 క్వింటాళ్ల బి య్యాన్ని పట్టుకొని యాజమానిపై కేసు నమోదు చేశారు. అలాగే వీరభద్ర రైస్‌ మిల్లులో 395 బ్యా గుల బియ్యాన్ని పట్టుకొని కేసు నమోదు చేశారు.  అమరచింత మండలంలో  రేషన్‌ బియ్యం అక్రమ దందాకు ముగ్గురు పేరు మోసిన ఆక్రమార్కులు ఉన్నారు. అందులో ఒకాయనను ఈ మధ్యనే కేసు నమోదు చేసి జైలుకు పంపారు. మండలంలోని ధర్మపూర్‌ శివారులో 80 క్వింటాళ్ల బియ్యాన్ని పట్టు కున్నారు. ఒక పక్క దాడులు చేసి పట్టుకుంటున్న వ్యాపారులు మాత్రం  రేషన్‌ బియ్యం అక్రమ వ్యా పారాన్ని మాత్రం కొనసాగిస్తూనే ఉన్నారు. దీనికం తటికి కారణం జిల్లాలోని ఫౌరసరఫరాల అధికారి లోపాకాయిరి ఒప్పందంతోనే అనే ఆరోపణలు విని పిస్తున్నాయి. పేదలకు అందాల్సిన బియ్యాన్ని వ్యా పారులు పక్కదారి పట్టిస్తూ ఆక్రమ సంపా దనకు తెరలేపారు. ఆక్రమ వ్యాపారం చేసే వారి పట్ల ప్ర భుత్వం ప్రత్యేక టాస్క్‌ఫోర్సును ఏర్పాటు చేసి అక్ర మ వ్యాపారాన్ని అరికట్టాలని ప్రజలు డిమాండ్‌ చేస్తున్నారు. ఈ విషయంపై జిల్లా ఫౌరస రఫరాల ఇన్‌చార్జి అధికారి వనపర్తి ఆర్డీవో అమరేందర్‌ను వివరణ  కోరగా నేను ఇన్‌చార్జి తీసుకొని రెండు  రోజులైంది వివరాలు తెలియవని బదులిచ్చారు. 


Updated Date - 2021-07-30T04:41:06+05:30 IST