Abn logo
Sep 15 2021 @ 20:18PM

రేషన్ లారీ పట్టివేత

కృష్ణా: జిల్లాలోని మైలవరంలో రేషన్ లోడ్‌తో ఉన్న లారీని పోలీసులు పట్టుకున్నారు. విజయవాడ రోడ్‌లోని ఒక పెట్రోల్ బంక్ వద్ద లారీ ఆగి ఉంది.  అనుమానం రావడంతో తన సిబ్బందితో కలిసి మైలవరం ఎస్ఐ రాంబాబు తనిఖీలు చేసాడు. ఈ తనిఖీల్లో రేషన్ బియ్యం దొరికాయి. లారీలో దాదాపు10 నుంచి15 టన్నులు బియ్యం ఉండవచ్చని పోలీసులు అంచనా వేస్తున్నారు. లారీని పోలీసులు స్టేషన్‌కి తరలించారు. లారీ డ్రైవర్, ఓనర్‌ను పట్టుకోవడానికి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

ఇవి కూడా చదవండిImage Caption

క్రైమ్ మరిన్ని...