ప్రొద్దుటూరులో రేషన్‌ మాఫియా

ABN , First Publish Date - 2022-01-22T04:54:34+05:30 IST

బంగారు నగరిలో రేషన్‌ బియ్యం మాఫియా కోరలు చాచింది. అధి కారులను సైతం శాసించే రాజకీ య నేతల వ్యవహారం బట్టబ యలైంది.

ప్రొద్దుటూరులో రేషన్‌ మాఫియా
గురువారం పెద్ద సంఖ్యలో అక్రమంగా నిల్వ ఉంచిన రేషన్‌ బియ్యం బస్తాలు

రెండురోజుల కిందటే గౌడౌన్‌ను గుర్తించిన అధికారులు

సీజ్‌ చేయకుండా మాఫియాకు సహకారం

భారీ నిల్వల ఆనవాళ్లు - రాత్రికి రాత్రి తరలించిన వైనం

గౌడౌన్‌ తాళాలు పగులకొట్టి 42 బస్తాలు సీజ్‌

ప్రొద్దుటూరు అర్బన్‌ జనవరి 21: బంగారు నగరిలో రేషన్‌ బియ్యం మాఫియా కోరలు చాచింది. అధి కారులను సైతం శాసించే రాజకీ య నేతల వ్యవహారం బట్టబ యలైంది. బుధవారమే బస్తాల విషయం అటు పోలీసు, ఇటు రె వెన్యూ అధికారులకు తెలిసినా చర్యలు తీసుకోవడంలో పోటీ పడి మరీ జాప్యం చేసినట్లు తె లుస్తోంది. సుమారు వందల సంఖ్యలో బస్తాలున్నట్లు ఆనవా ల్లున్నా అధికారులు సీజ్‌ చేసినది 42 బస్తాలే కావడం అధికారుల తీరుకు అద్దం పడుతోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పేదలకు అం దిస్తున్న బియ్యం గొడౌన్‌ నుంచి రేషన్‌ దుకాణానికి చేరకముందే డీలర్లు బియ్యం మాఫియాకు విక్రయిస్తున్నారనే ఆరోపణలు న్నాయి.

గోనె సంచుల్లోనే అక్ర మంగా రహస్య ప్రదేశాల్లో ఉంచి లారీల్లో అర్దరాత్రిళ్లు బయటి ప్రాంతాలకు తరలి స్తున్నట్లు తెలుస్తోంది. కోట్ల రూపాయల బియ్యం వ్యాపారం నిరాటంకంగా సాగుతోం దన్నది జగమెరిగిన సత్యం. తాజాగా రెండు రోజుల కిందట ప్రొద్దుటూరు పట్టణ శివారు లింగాపురం వద్ద పాత ఆటోనగర్‌ కాంప్లెక్స్‌ లోని 13 నెంబరు గదిలో రేషన్‌ బియ్యాన్ని అక్రమంగా నిల్వ వుంచిన సమాచారం రూరల్‌ పోలీసులు రెవెన్యూ అధికా రులకు రిక్విజేషన్‌ ఇచ్చారు.

తహసీల్దారు నజీర్‌ అహ్మద్‌ గురువారం సాయంత్రం పోలీసుల నుంచి వచ్చిన సమాచారాన్ని ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డీటీ వరదకిషోర్‌రెడ్డికి తెలియజేసి సరుకును సీజ్‌ చేయమని ఆదేశించారు. ఆయన ఆ సమయానికి కడపలో వున్నట్లు తాను వచ్చే సరికి ఆలస్య మౌతుందని సమాచారమిచ్చినట్లు తెలుపుతున్నారు. సీజ్‌ చేయకుండా అధికారులు చెపుతున్న సాకులు పలు అనుమానాలకు తావిస్తోంది. ఈ విషయం గురువారం రాత్రి ఎలకా్ట్రనిక్‌ మీడియాలో ప్రసారం, సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ జరగడంతో రేషన్‌ బియ్యం సీజ్‌ చేయమని జాయింట్‌ కలెక్టర్‌ గౌతమి ఆర్‌డీఓ శ్రీనివాసులును ఆదేశించారు. దీంతో శుక్రవారం ఉదయం 11 గంటలకు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డీటీ వరదకిషోర్‌ రెడ్డి, ఆర్‌ఐ స్వామి వీఆర్‌ఓ భాస్కర్‌ రెడ్డి, విష్ణు అక్కడికి చేరుకుని గౌడౌన్‌ తాళం పగులగొట్టి షట్టర్‌ తెరిచారు. అందులో ప్రభుత్వ గోనె సంచుల్లో వున్న 42 రేషన్‌ బియ్యం బస్తాలు సీజ్‌ చేశారు.

అయితే అక్కడ భారీగా బియ్యం బస్తా నిల్వలున్నట్లు, బియ్యం మరో సంచుల్లోకి మార్చినట్లు ఆనవా ల్లున్నాయి. గది నిండా బియ్యం నిల్వలున్న గుర్తులున్నా, బియ్యం సంచులు మార్చు తుండగా కిందపడిన బియ్యం కుప్పలు, ఊడ్చడానికి చీపుర్లున్నా, షట్టర్‌ తెరిచినప్పు డు లైట్లు కూడా వెలుగుతూనే వున్నా అధికారులు పట్టించుకోక పోవడం వారి నిర్లక్ష్యానికి నిలువుటద్దంగా నిలుస్తోంది. దీన్ని బట్టి తెల్లవారుజామున హడావుడిగా లారీల్లో సరుకును అక్రమార్కులు తరలించినట్లు స్పష్టమౌతోంది. ఇదంతా రెవెన్యూ అధికారుల కనుసన్నల్లో సాగుతుందనే అనుమానాలకు వీరు ప్రదర్శించిన నిర్లక్ష్యం బలం చేకూరుస్తోంది. గురువారం పోలీసులు సమాచారమిచ్చినా రూమును సీజ్‌ చేయక పోవడం చూస్తే ఇందులో బడా రాజకీయ పెద్దల హస్తం వుండడంతోనే అధి కారులు జాప్యం చేశారని ప్రచారం జరుగుతోంది.

అంతేకాక పర్యవేక్షణా లోపాలు కప్పిపుచ్చుకునే యత్నాల్లో భాగంగా బియ్యం తరలింపులో అధికారులు సహకరించారనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇప్పటికైనా ఆ గౌడౌన్‌ను ఎవరు తీసుకున్నారు. అక్కడ ఎవరు రేషన్‌ బియ్యం అక్రమంగా నిల్వ వుంచారనే కోణంలో విచారణ జరిపితే అసలు దొంగలు బయటపడతారని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. ఈ దిశగా అధికారులు చర్యలు తీసుకుంటారో లేదో వేచి చూడాలి మరి.



Updated Date - 2022-01-22T04:54:34+05:30 IST