Abn logo
Dec 5 2020 @ 00:43AM

డబ్బులిస్తేనే రేషన్‌

పెరిగిన కందిపప్పు ధర

డీలర్ల వద్ద బలవంతంగా డీడీలు 

కార్డుదారులు నగదు చెల్లించాల్సిందే

నేటి నుంచి రేషన్‌ షాపుల  ద్వారా సరుకుల పంపిణీ

ఒంగోలు (కలెక్టరేట్‌), డిసెంబరు 4 : ఇక నుంచి రేషన్‌ కార్డుదారులు నగదు చెల్లించి మా త్రమే సరుకులు తీసుకెళ్లాలి. జిల్లాలో శనివారం నుంచి రేషన్‌షాపుల ద్వారా సరుకులు పంపిణీ చేయనున్నారు. కరోనా విపత్కర పరిస్థితుల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పేదలకు నెలకు రెండు సార్లు ఉచితంగా సరుకులను అందించాయి. ఆ ప్రక్రియ నవంబరుతో ముగిసింది. ఈ నెల నుంచి కార్డుదారులు పాత పద్ధతిలోనే సరుకులు తీసుకో వాలని అధికారులు చెప్తున్నారు. జిల్లాలో 2,151 రేషన్‌షాపుల పరిధిలో 10.25లక్షల రేషన్‌ కార్డులు ఉన్నాయి. వీరంతా పెరిగిన ధరల ప్రకారం నగదు చెల్లించి రేషన్‌ దుకాణాల ద్వారా సరుకులు తీసు కోవాల్సి ఉంటుంది. 


కందిపప్పు కిలో రూ. 67

రేషన్‌ షాపుల ద్వారా ఇచ్చే కందిపప్పు ధరను ప్రభుత్వం భారీగా పెంచింది. అంతకు ముందు కిలో రూ.40కి విక్రయించగా, ఈనెల నుంచి కిలో రూ.67కు పెంచింది. ఒక్కసారిగా రూ.27 పెరగడం తో కార్డుదారులపై కరోనా విపత్కర పరిస్థితుల్లో ఆర్థిక భారం పడింది. బహిరంగ మార్కెట్‌లో కంది పప్పు కిలో రూ.75 నుంచి రూ.80కు లభిస్తుండ గా, రేషన్‌షాపుల్లో కిలోకు రూ.67 చెల్లించి కార్డుదా రులు కొనుగోలు చేస్తారా లేదోనని డీలర్లు ఆందోళ న చెందుతున్నారు. కార్డుదారులు బియ్యానికి కిలోకు రూపాయి, పంచదార అర కిలోకు రూ.17 చెల్లించాలి.


డీడీలు చెల్లించేందుకు డీలర్ల విముఖత

ధరలు పెరగడంతో డీలర్లు కందిపప్పుకు డీడీలు చెల్లించేందుకు విముఖత చూపారు. దీంతో పౌర సరఫరాల శాఖ ఉద్యోగులు రంగంలోకి దిగి డీలర్ల ద్వారా బలవంతంగా డీడీలు తీయించారు. అయి నా పూర్తిస్థాయిలో డీడీలు తీయకపోవడంతో పౌర సరఫరాల శాఖ అధికారులు ఆయా రేషన్‌షాపుల కు కందిపప్పును సరఫరా చేస్తున్నారు. దీంతో డీలర్లు తమకు బలవంతంగా కందిపప్పు ఇస్తున్నా రనే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.Advertisement
Advertisement
Advertisement